Sakshi News home page

పిల్లల ఫేమస్‌ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి..

Published Mon, Jul 24 2023 8:47 AM

woman shocked to see dangerous thing about posting images children - Sakshi

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యేందుకు చాలామంది తమకు లభించే ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. తమ వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తూ కూడా పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు తమ పిల్లలను ఫేమస్‌ చేసేందుకు తపన పడుతుంటారు. పిల్లలు పుట్టినది మొదలు వారికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. 

చాలామంది తమకు పిల్లలకు పుట్టగానే వెంటనే ఫొటోతీసి, దానిని తమ చిన్నారి తొలి ఫోటో అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాలలో అకౌంట్‌ క్రియేట్‌ చేసి, వారి ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. 

సోషల్‌ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుని..
న్యూయార్క్‌ పోస్టులోని ఒక రిపోర్టు ప్రకారం కత్రీనా స్ట్రోడ్‌ అనే సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ తమకు పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌చేస్తూ వస్తోంది. తమ పిల్లలను సోషల్‌ మీడియా స్టార్స్‌గా చూడాలనుకుంది. కత్రీనాకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు 4 ఏళ్లు, కుమారునికి 3 ఏళ్లు. ఆమె తన ఇద్దరు పిల్లలను టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రమ్‌లోఫేమస్‌ చేసింది. 

టిక్‌టాక్‌ యూజర్‌ చేసిన పనికి..
తమ పిల్లలను ఆడుకుంటున్నప్పటి ఫొటోలు, వీడియోలు, స్విమ్మింగ్‌ చేస్తున్నప్పటి వీడియోలను కత్రీనా తరచూ పోస్టు చేస్తుంటుంది. అయితే కత్రీనా 2022లో ఉన్నట్టుండి తమ పిల్లల ఫొటోలను, వీడియోలను షేర్‌ చేయడం మానివేసింది. టిక్‌టాక్‌ యూజర్‌ ఒకరు కత్రీనా కుమారుని ఫోటోను ఉపయోగించి, ఒక పోస్టు క్రియేట్‌ చేసి, ఆ పిల్లాడు తన కుమారుడు అని పేర్కొన్నాడు. 

చిన్నారుల ఫొటోలను సేవ్‌ చేసుకుని..
అమెరికాలోని కరోలినాలో ఉంటున్న కత్రీనా తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడుతూ ‘మా పిల్లల మాదిరిగానే చాలామంది పిల్లలకు ఇలాంటి ముప్పు ఎదురవుతోంది. చాలామంది సోషల్‌ మీడియాలో షేర్‌ అయ్యే చిన్నారుల ఫొటోలను సేవ్‌ చేసుకుని దుర్వినియోగం చేస్తున్నాన్నారని’ తెలిపింది. ఈ విషయాన్ని తన భర్తకు కూడా తెలియజేశానని పేర్కొంది. కత్రీనా తాను ఇన్నాళ్లూ చేస్తూ వచ్చిన పనికి పశ్చాత్తాప పడింది. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి..
ఈ  చేదు అనుభవం ఎదురైన తరువాత ఆమె సోషల్‌ మీడియాలోని తమ పిల్లల ఫొటోలను, వీడియోలను తొలగించింది. ‍2021లో అమెరికాకు చెందిన ఒక రిపోర్టు ప్రకారం 77శాతం తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్‌ చేస్తున్నారు. పలువురు కేటుగాళ్లు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి చిన్నారుల ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని పలు ఉదంతాలు నిరూపిస్తున్నాయి.   
ఇది కూడా చదవండి: సీమా, సచిన్‌ల స్టోరీని తలపించే ఇక్రా, ములాయం లవ్‌ స్టోరీ.. చివరికి?

Advertisement
Advertisement