వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!

21 Nov, 2021 12:30 IST|Sakshi

ఏదైన వ్యాధి వస్తే తొందరగా తగ్గిపోయేంత వరకు మనస్సు ఒక పట్టాన కుదుటపడదు. అలాంటిది కొన్ని అరుదైన వ్యాధులతో పోరాడతూనే మరోవైపు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏ చిన్న అవకాశమైన దొరక్కుండా పోతుందా అనే ఆశతో ఎదురుచేసేవాళ్లను చూస్తే చాలా బాధనిపిస్తుంది కదూ. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతోంది. 

(చదవండి: టెన్నిస్‌ ప్లేయర్ ఆచూకిని సరైన ఆధారాలతో సహా తెల్పండి)

అసలు విషయంలోకెళ్లితే....బోల్టన్‌కు చెందిన లీన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటూ అరుదైన పరిస్థితితో జీవితాన్ని గడుపుతోంది. పైగా ఆమె నిరంతర వికారం కడుపు నొప్పి కారణంగా ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు ఆమె ఈ సమస్య కారణంగా ఏమి తినలేక జీర్ణించకోలేక అత్యంత బాధను అనుభవిస్తున్న సందర్భాలు అనేకం. అయితే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తొలిసారిగా 2008లో గుర్తించడమే కాక గ్యాస్ట్రోపరేసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఆ తర్వాత ఆమెకు గ్యాస్ట్రిక్‌ పేస్‌మేకర్‌ను అమర్చారు. అయితే ఆ పరికరానికి సంబంధించిన బ్యాటరీ అయిపోవడంతో పరిస్థితి మళ్లీ యథావిధికి వచ్చేసింది. పైగా ఆ బ్యాటరీలు చాలా అరుదుగా లభిస్తాయని, వాటిని మార్చడం కోసం దగ్గర దగ్గరగా సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ఆమె ఈ వ్యాధి కారణంగా ఉద్యోగానికి దూరమవ్వడమే కాక కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

దీంతో ఆమె తను ఏవిధంగానైన తన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో గ్యాస్ట్రిక్‌ పేస్‌మేకర్‌ కొత్తబ్యాటరీ కోసం కావల్సిన డబ్బుల నిమిత్తం "గో ఫండ్‌ మీ" అనే వెబ్‌పేజీ ఓపెన్‌ చేసి తన శస్త్రచికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో తనకు ఎవరైనా సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఆ వెబ్‌పేజ్‌కి సుమారు రూ. 3 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. ఏది ఏమైన ఆమె ఆశావాహదృక్పథానికి అభినందిస్తూ...లీన్నే శస్త్ర చికిత్సకు కావల్సిన డబ్బులు సమకూరి త్వరితగతిన ఆ అరుదైన వ్యాధి నుండి బయటపడాలని ఆశిద్దాం.

(చదవండి: అమెజాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు)

మరిన్ని వార్తలు