యూట్యూబ్‌ ఛానళ్లకు షాక్‌.. ఆ కంటెంట్‌ ఉంటే నిషేధమే..! | Sakshi
Sakshi News home page

YouTube: యూట్యూబ్‌ ఛానళ్లకు షాక్‌.. ఆ కంటెంట్‌ ఉంటే నిషేధమే..!

Published Wed, Sep 29 2021 9:23 PM

YouTube Will Ban All Anti Vaccine Content - Sakshi

వాషింగ్టన్‌: కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ల వల్ల దుష్పరిణామాలు వాటిల్లుతున్నాయంటూ రకరకాలుగా ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తున్న వీడియోలన్నింటిని బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రముఖ టెక్‌ దిగ్గజం యూట్యూబ్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా యూట్యూబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ అధికారి మాట్‌ హాల్‌ ప్రిన్‌ మాట్లాడుతూ ‘ప్రముఖ అల్ఫాబేట్‌ అమెరికన్‌ మల్టీ నేషనల్‌ టెక్నాలజీ సంబంధించిన ఆన్‌లైన్‌ వీడియో కంపెనీ.. కోవిడ్‌ వ్యాక్సిన్‌లకు విరుద్ధంగా తప్పుడు సమాచారం ఇస్తున్న ఉద్యోగులను శాశ్వతంగా నిషేధించిన విషయాన్ని ప్రస్తావించారు.  

(చదవండి: వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా!)

కోవిడ్‌ వ్యాక్సిన్‌లకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారిలో రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ, జోసెఫ్ మెర్కోలా వంటి ప్రముఖులు ఉన్నారని కూడా చెప్పారు. ప్రముఖ సోషల్‌ మాధ్యమాలైన యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటివి.. ఇలాంటి వీడియోలకు మద్దతు ఇస్తున్నాయే తప్ప అడ్డుకట్టవేయడం లేదంటూ సర్వత్రా విమర్శలు తలెత్తడంతో యూట్యూబ్‌ ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు యూట్యూబ్‌ కఠిన నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గట్టిదెబ్బ ఎదుర్కొందనే చెప్పాలి. ఎందుకంటే రష్యన్ స్టేట్-బ్యాక్డ్ బ్రాడ్‌కాస్టర్ కోవిడ్‌-19 పాలసీకి విరుద్ధంగా తప్పుడు సమాచారం ఇస్తుందంటూ యూట్యూబ్‌లోని జర్మన్ భాషా ఛానెల్‌లను మంగళవారమే తొలగించిన విషయం తెలిసిందే. 

(చదవండి: పాకిస్తాన్‌ వైపుగా వెళ్తున్న గులాబ్‌ తుపాన్‌)

Advertisement
Advertisement