రేచపల్లిలో మామిడి మొక్కలు ధ్వంసం | Sakshi
Sakshi News home page

రేచపల్లిలో మామిడి మొక్కలు ధ్వంసం

Published Fri, Sep 8 2023 1:02 AM

ధ్వంసమైన మామిడి మొక్కలను పరిశీలిస్తున్న  గ్రామస్తులు,  ధ్వంసమైన మొక్క (ఇన్‌సెట్‌లో) 
 - Sakshi

సారంగాపూర్‌(జగిత్యాల): మండలంలోని రేచపల్లిలో ముగ్గురు మహిళా రైతులకు చెందిన మామిడి మొక్కలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గ్రామస్తుల వివరాలు.. రేచపల్లి గ్రామానికి చెందిన రేండ్ల లక్ష్మి, రేండ్ల పుష్ప, రేండ్ల సరిత భర్తలు ముంబయిలో కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారు ముంబయి వెళ్లడంతో వరిపొలాలు సాగుచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో మామిడి మొక్కలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 15 రోజులుగా భూమిని చదును చేసి, గుంతలు తవ్వి 360 మామిడి మొక్కలు (రెండున్నర సంవత్సరాల వయస్సు గల మొక్కలు) నాటారు. పైప్‌లైన్లు, డ్రిప్‌ సైతం ఏర్పాటు చేయించుకున్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి ప్రవేశించి విచ్చలవిడిగా మా మిడిమొక్కలను, పైప్‌లైన్లు, డ్రిప్‌ను ధ్వంసం చేశా రు. తమకు లక్షల రూపాయల నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

1/1

Advertisement
Advertisement