ఫీజు పెంపు సరికాదు | Sakshi
Sakshi News home page

ఫీజు పెంపు సరికాదు

Published Mon, Sep 11 2023 1:14 AM

- - Sakshi

ఉద్యోగాలు రాక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో అరకొర పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వడం శోచనీయం. అంతేకాదు.. పరీక్ష ఫీజు రూ.200 నుంచి రూ.1,000కు పెంచడం దారుణం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతోంది. పోస్టులే తక్కువ. ఫీజు భారం మోపడం సరికాదు.

– గాంధారి వెంకటరమణ, నిరుద్యోగి, సిరికొండ

పోస్టులు తక్కువ

డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాకు తక్కువగా పోస్టులు కేటాయించడం బాధాకరం. లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల సంఖ్య 37గా ఉంటే అందులో తెలుగు పండిట్‌ పోస్టులు 15 దాటే అవకాశం లేదు. ఆరేళ్ల నుంచి నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నాం. ఈ తరుణంలో కొన్ని పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వడంతో నిరాశకు గురయ్యాం. ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలు అన్నింటినీ భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించాలి.

– భూమేశ్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, చింతకుంట

1/1

Advertisement
Advertisement