ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు

Published Sun, Nov 12 2023 1:28 AM

డబ్బులు అందిస్తున్న చిన్నారితో సంజయ్‌ - Sakshi

జగిత్యాలరూరల్‌: ప్రజలే తన జీవితమని, ఐదేళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం జగిత్యాలరూరల్‌ మండలం నర్సింగాపూర్‌, వంజరిపల్లి, గొల్లపల్లి, జాబితాపూర్‌, ధర్మారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇచ్చే సర్కారు కావాలా.. మూడు గంటల కరెంట్‌ ఇచ్చే కాంగ్రెస్‌ కావాలా ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్రం రాకముందు కరెంట్‌ కష్టాలు ఎలా ఉండేవో అందరికీ తెలుసని, కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్‌, పంట పెట్టుబడి సాయంతో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. రుణమాఫీ ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరిందన్నారు. సర్కారుబడులను అభివృద్ధి చేసి ఇంగ్లిష్‌ మీడియంతోపాటు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. జిల్లాకేంద్రంలో 100 పడకల మాతాశిశు కేంద్రం, 600 పడకల సామర్థ్యం గల మెడికల్‌ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తెచ్చామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ గత పాలకులు ఎస్సీ వర్గాన్ని ఓట్ల కోసమే వాడుకున్నారని, సీఎం కేసీఆర్‌ మాత్రం దళితులు ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దళితబంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దామోదర్‌రావు, ఎల్లారెడ్డి, మహిపాల్‌రెడ్డి, దావ సురేశ్‌, నక్కల రవీందర్‌రెడ్డి, సందీప్‌రావు, సదాశివరావు, సురేందర్‌, చెరుకు జాన్‌, గంగాధర్‌, మహేశ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

వృద్ధురాలు ఆర్థిక సహాయం

నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన మ్యాక కిష్టవ్వ తన ఆసరా పింఛన్‌ నుంచి రూ.వెయ్యిని సంజయ్‌ ఎన్నికల ఖర్చు కోసం అందించారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు

మండలం జాబితాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సట్ట నర్సయ్య, జోగ రజిత, లక్ష్మీ, వరలక్ష్మీ బీఆర్‌ఎస్‌లో చేరగా వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన భారత అద్భుత అనే చిన్నారి తన కిడ్డీబ్యాంక్‌ నుంచి రూ.4వేలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు అందించింది.

పార్టీలో చేరిన బీజేపీ యువకులు

మండలంలోని పొరండ్ల గ్రామానికి చెందిన బీజేపీ యూత్‌ నాయకులు చిర్రవేణి లక్ష్మణ్‌, తోట మణిదీప్‌, తిరందాస్‌ గణేశ్‌, ప్రణీత్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నాయకులు ఆరె రవి, తోట మహేశ్‌, శ్రీనివాస్‌, ఆనందరావు, శరత్‌రావు, సుమన్‌రావు పాల్గొన్నారు.

మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

ఓటు అడుగుతున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌
1/1

ఓటు అడుగుతున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌

Advertisement
Advertisement