బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలి | Sakshi
Sakshi News home page

బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలి

Published Sun, Nov 12 2023 1:28 AM

- - Sakshi

కోరుట్ల/ఇబ్రహీంపట్నం: బీజేపీ, కాంగ్రెస్‌ కు ట్రలను తిప్పికొట్టాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ ప్రజా సేవలోనే ఉంటానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల, ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. తన కుమారుడు సంజయ్‌ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాల్టీలను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపానని వెల్లడించారు. అనంతరం మైనార్టీలతో సమావేశమయ్యారు. కరోనా సమయంలో సంజయ్‌ సుమారు 6వేల మంది విద్యార్థులకు వ్యాక్సిన్‌ వేయించారని గుర్తు చేశారు. అక్సిజన్‌ సిలండర్ల కొరతతో జనం అవస్థలు పడితే సొంత ఖర్చులతో సిలిండర్లు, అంబులెన్స్‌ ఏర్పాటు చేశారన్నారు. కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలోనే వచ్చి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, అలాంటి నేతలు ఎన్నికల తరువాత కనిపించబోరని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ అన్నారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది యువకులు, మైనార్టీలు పార్టీలో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నం లావణ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గడ్డమీద పవన్‌, మాజీ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు అన్నం అనిల్‌, దారిశెట్టి రాజేశ్‌, కాశీరెడ్డి మోహన్‌రెడ్డి, కౌన్సిలర్‌ గంధం గంగాధర్‌, సజ్జు, బాబాలు పాల్గొన్నారు.

గోధూర్‌లో ఒడ్డెరుల మద్దతు

ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌లో ఒడ్డెర సంఘానికి చెందిన 150 కుటుంబాలు బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉంటామని తీర్మానించిన పత్రాన్ని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు అందించారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం కేసీఆర్‌ను ఓడించే శక్తి ఎవరికీ లేదన్నారు.

సంజయ్‌ను ఆశీర్వదించండి

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల

మైనార్టీ మహిళలతో సమావేశం

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement