Sakshi News home page

పోలింగ్‌ శాతం పెంచేందుకు..

Published Tue, Nov 14 2023 12:34 AM

మహిళా ఓటర్లు
 - Sakshi

ధర్మపురి: ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత. ఓటు పెంపుదల కోసం ఈసారి ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. కొన్ని సంవత్సరాల నుంచి పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. కాని మహిళలు, యువకులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో.. వేలాది మంది తమ ఓటును వినియోగించుకోలేకపోయారు. కాని ఈసారి అలా జరగకుండా ఉండేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం ఓటింగ్‌ జరిగేలా చర్యలు చేపడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కొన్ని ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి యువతకు, ఒకటి దివ్యాంగులకు, ఐదు ఆదర్శ, ఐదు మహిళల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో మొత్తం 785 పోలింగ్‌ కేంద్రాలుండగా.. ధర్మపురిలో 269, జగిత్యాలలో 254, కోరుట్లలో 262 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో యువతకు 3, దివ్యాంగులకు 3, మహిళలకు 15, ఆదర్శ కేంద్రాలు 15 ఏర్పాటు చేయనున్నారు.

ఆదర్శ కేంద్రాలు..

గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్‌ ఎక్కడ జరిగిందో గుర్తించారు. ఆదర్శ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఒక్కో నియోజకవర్గంలో ఐదు కేంద్రాలను ఎంపిక చేశారు. వంద శాతం ఓటు జరిగేలా చర్యలు చేపడుతున్నారు.

యువతకు ప్రత్యేక కేంద్రం..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువత కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల్లో యువత కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. సత్ఫలితాలనిచ్చింది. యువ ఓటర్లను ఆకర్షించేలా గోడలపై సందేహాలను రాసి ప్రదర్శించనున్నారు. ఈ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను యువ అధికారులకు కేటాయిస్తారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 18 నుంచి 39 వయస్సున్న యువ ఓటర్లు 3,15,197 మంది ఉన్నారు.

మహిళలకు ప్రత్యేకం..

ఎన్నికల్లో మహిళలదే కీలక పాత్ర. ఈసారి వారికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో నియోజకవర్గానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి వారి కోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో అటెండర్‌ స్థాయి నుంచి అధికారి స్థాయి వరకు మహిళలనే ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 3,55,629 మంది మహిళా ఓటర్లున్నారు.

దివ్యాంగులకు..

గత ఎన్నికల్లో వేల మంది దివ్యాంగులు సరైన వసతుల్లేక ఓటు వినియోగించుకోలేకపోయారు. ఈసా రి వంద శాతం ఓటేసేందుకు దివ్యాంగులకు నియోజకవర్గానికో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

మహిళలు, యువకులు, దివ్యాంగులకు ప్రత్యేక కేంద్రాలు

పోలింగ్‌ పెంచొచ్చు

వంద శాతం ఓటింగ్‌ జరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక కేంద్రాలపై దృష్టి సారించింది. జిల్లా ఎన్ని కల అధికారి ఆదేశాల మేర కు ప్రత్యేక కేంద్రాలను ఏ ర్పాటు చేసి ఆకర్శణీయంగా తీర్చిదిద్దుదాం. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం.

– దివాకర, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

Advertisement

తప్పక చదవండి

Advertisement