నువ్వు లేకుండా ఎలా బతికేది.. | Sakshi
Sakshi News home page

నువ్వు లేకుండా ఎలా బతికేది..

Published Tue, Nov 21 2023 12:42 AM

గంగాధర్‌ గౌడ్‌ (ఫైల్‌)
 - Sakshi

చందుర్తి(వేములవాడ): ఉపాధివేటలో గల్ఫ్‌ బాట పట్టిన యువకుడి శవపేటికలో తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ అంటూ మృతుని భార్య రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని అనంతపల్లికి చెందిన బుర్ర గంగాధర్‌గౌడ్‌(44) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం కువైట్‌ వెళ్లాడు. అక్కడ పెట్రోల్‌బంక్‌లో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. బుధవారం పనిచేస్తుండగా గుండెపోటు రావడంతో అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందగా.. సోమవారం శవపేటిక స్వగ్రామానికి చేరింది. శవపేటికపై పడి భార్య లక్ష్మి, తల్లి గంగవ్వ రోదనలు మిన్నంటాయి. మృతునికి తండ్రి సత్తయ్య, తల్లి గంగవ్వ, భార్య లక్ష్మి, కుమారుడు మనివర్ధన్‌, కూతురు మణిదీప్తి ఉన్నారు.

కువైట్‌లో గుండెపోటుతో యువకుడి మృతి

స్వగ్రామానికి శవపేటిక

కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు

Advertisement

తప్పక చదవండి

Advertisement