రామలింగేశ్వర స్వామి నమోనమః | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వర స్వామి నమోనమః

Published Wed, Nov 22 2023 12:20 AM

వాల్గొండలోని శ్రీరామలింగేశ్వర ఆలయం - Sakshi

మల్లాపూర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏకై క హరిహరక్షేత్రం.. మల్లాపూర్‌ మండలం వాల్గొండ గోదావరి తీరాన ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలో కార్తీకమాస ఉత్సవాలను ఈనెల 22 నుంచి 26న నిర్వహించనున్నారు. పౌర్ణమిరోజు లక్ష దీపాలతో అలంకరించనున్నారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి సాధువులు హాజరుకానున్నారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఎంపీటీసీ క్యాతం సుజాత, వాల్గొండ తండా సర్పంచ్‌ ధరంసోత్‌ కళావతి, వాల్గొండ సర్పంచ్‌ దండిక గంగు, ఆలయ కమిటీ వైస్‌ చైర్మన్‌ చిలువేరి లక్ష్మి కోరారు. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ సాంబారి శంకర్‌ తెలిపారు.

Advertisement
Advertisement