పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

Published Thu, Nov 30 2023 1:40 AM

రిటర్నింగ్‌ కార్యాలయం టెంట్ల కింద సామగ్రితో పోలింగ్‌ సిబ్బంది
 - Sakshi

గోదావరిఖని: రామగుండం రిటర్నింగ్‌ కార్యాలయం నుంచి పోలింగ్‌ సిబ్బంది ఆయా గ్రామాలు, పోలింగ్‌ బూత్‌లకు బయలుదేరారు. గురువారం నిర్వహించే ఎన్నికల కోసం ఈవీఎంలు, ఇతర సామగ్రితో పయనమయ్యారు. రామగుండం నియోజకవర్గంలో 116 లొకేషన్లలో 260 పోలింగ్‌ బూత్‌లున్నాయి. పోలింగ్‌ కోసం సుమారు 1500మంది సిబ్బంది, వెయ్యి పోలీసులను వినియోగిస్తున్నారు. నియోజకవర్గంలో 2,21లక్షల మంది ఓటర్లుండగా, ఈసారి 80శాతానికి పైగా ఓటింగ్‌ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. గతంలో 71శాతం పోలింగ్‌ జరిగింది. ఈసారి 15వేలకు పైగా కొత్త ఓటర్లున్నారని అధికారులు వెల్లడించారు. ఓటేసేందుకు వచ్చే ఓటర్లు ఓటర్‌ స్లిప్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని కోరారు. నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మంథని జేఎన్‌టీయూలో ఉంటుందన్నారు.

ఈవీఎంలతో వెళ్తున్న ఉద్యోగులు
1/2

ఈవీఎంలతో వెళ్తున్న ఉద్యోగులు

 బందోబస్తు సమీక్షిస్తున్న డీసీపీ చేతన
2/2

బందోబస్తు సమీక్షిస్తున్న డీసీపీ చేతన

Advertisement
Advertisement