గల్ఫ్‌ బాధితుడి వైద్యానికి రూ.1.32 లక్షలు సాయం | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ బాధితుడి వైద్యానికి రూ.1.32 లక్షలు సాయం

Published Thu, Nov 30 2023 1:40 AM

విరాళాన్ని అందిస్తున్న మేనేజర్‌  - Sakshi

ధర్మపురి:కుటుంబపోషణ భారం కావడంతో దుబాయికి వెళ్లిన ఓ కార్మికుడు అక్కడా ఉపాధి లేక తిరిగి వచ్చాడు. రాగానే బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. దీంతో కాలు, చేయి పడిపోయింది. ఆయన వైద్య ఖర్చుల కోసం సామాజిక మిత్రులు రూ.1.32 లక్షలు సాయం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ధర్మపురి మండలకేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దివిటి సురేశ్‌కు భార్య, కూతురు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం ఆర్నెల్ల క్రితం దుబాయి వెళ్లాడు. అక్కడ సరిగా పని దొరక్క పోవడంతో స్వగ్రామానికి వచ్చాడు. నాలుగు నెలల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురి కాగా కాలు, చేయి పడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. అప్పు చేసి వైద్యం చేయిస్తున్నా పూర్తిగా నయం కావడంలేదు. డబ్బులు లేకపోవడంతో వైద్య సేవలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆయన దీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్‌ ఈనెల 4న ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి సాయం అందించాలని కోరారు. స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు రూ.1.32లక్షలను సురేశ్‌ భార్య రాణి బ్యాంకు ఖాతాకు పంపించారు. ఆ మొత్తాన్ని రమేశ్‌ బుధవారం స్థానిక యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ రవితేజ చేతులమీదుగా సురేశ్‌ భార్యకు అందించారు. దాతలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement