వెల్‌కం సర్‌.. | Sakshi
Sakshi News home page

వెల్‌కం సర్‌..

Published Sat, Dec 2 2023 1:36 AM

- - Sakshi

జగిత్యాల: ధర్మపురి నియోజకవర్గ లెక్కింపు పరిశీలకులుగా డాక్టర్‌ బిడ్యా నంద్‌సింగ్‌ జగిత్యాలకు రాగా కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ లత మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బొకే అందజేసి స్వాగతం పలికారు.

నూతన మద్యం దుకాణాలు ప్రారంభం

జగిత్యాలక్రైం: నూతన మద్యం దుకాణాలు ప్రారంభమైనాయి. 2023–25 రెండు సంవత్సరాలకు గాను లక్కీ డ్రా పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణం దారులను ఎంపిక చేయగా, ఎట్టకేలకు ఈనెల 1న శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు ప్రారంభించారు. బుధ, గురువారం మద్యం దుకాణాలు మూసి ఉండటంతో శుక్రవారం కొత్త మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు భారీ ఎత్తున క్యూకట్టి మద్యం కొనుగోలు చేశారు.

జగిత్యాలలోని ఓ మద్యం దుకాణం వద్ద  క్యూ కట్టిన మందుబాబులు
1/1

జగిత్యాలలోని ఓ మద్యం దుకాణం వద్ద క్యూ కట్టిన మందుబాబులు

Advertisement
Advertisement