అభ్యర్థుల్లో టెన్షన్‌ టెన్షన్‌ | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల్లో టెన్షన్‌ టెన్షన్‌

Published Sun, Dec 3 2023 12:52 AM

- - Sakshi

జగిత్యాల: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోపల ఆందోళనకు గురవుతున్నారు. నవంబర్‌ 30న పోలింగ్‌ పూర్తయిన విషయం తెల్సిందే. ఇప్పటికే అభ్యర్థులందరూ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో విశ్లేషణ చేసుకుంటన్నారు. ఆదివారం ఫలితాలు వెలువడనుండటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జగిత్యాలలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ కొంతమేర పోటీ ఇచ్చింది. అలాగే ధర్మపురిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య నువ్వానేనా అన్నట్లు కొనసాగింది. కోరుట్లలో బీఆర్‌ఎస్‌, బీజేపీతోపాటు, కాంగ్రెస్‌ సైతం గట్టి పోటీ ఇచ్చింది. అభ్యర్థులు తమ విజయ అవకాశాల కోసం పోలింగ్‌ కేంద్రాలు, మండలాల వారీగా విశ్లేషించుకుంటున్నారు. ఓట్లు కొన్ని చోట్ల పెరగగా, మరికొన్ని చోట్ల ఓటింగ్‌ తగ్గడంతో ఆ ప్రాంతాల్లో ఎలా ఉంటుందోనని నాయకులను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఈసారి బీజేపీతో ఓట్లు చీలనుండటంతో గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బీజేపీ చాలామట్టుకు ఓట్లను చీల్చినట్లు సమాచారం. మరోవైపు ఓటింగ్‌ శాతం తగ్గడంతో తమ ప్రాంతంలో పడే ఓట్లు తమకు రాకుండా పోతాయోనని ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకూ జిల్లాలో ఓటరు నాడి మాత్రం అంతుపట్టడం లేదు. ఎన్ని విశ్లేషణలు చేసినా ఓ నాయకుడు గెలుస్తాడని చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమదే విజయమంటే.. తమనే వరిస్తుందని ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పార్టీల నాయకులు పందాలు కాస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాకుండా ఆంధ్రాప్రాంతానికి చెందిన కొందరు ఇక్కడి వారికి ఫోన్లు చేస్తూ ఎవరు గెలుస్తారు..? పందాలు కాస్తారా..? అని ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

లోలోన ఆందోళన

ఈసారి ఎవరికి భారీ మెజార్టీ వచ్చే అవకాశం లేనందున అభ్యర్థుల్లో లోలోపల గుబులు చోటుచేసుకుంది. ఇప్పటికే కూడికలు, తీసివేతల్లో అభ్యర్థులు అంచనాలు వేస్తున్నప్పటికీ ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు.

ఉత్కంఠ రేపుతున్న ఫలితాలు

కార్యకర్తలు, నాయకులతో మంతనాలు

Advertisement
Advertisement