కోలాహలంగా ఎన్నికల కౌంటింగ్‌ | Sakshi
Sakshi News home page

కోలాహలంగా ఎన్నికల కౌంటింగ్‌

Published Mon, Dec 4 2023 1:52 AM

- - Sakshi

జగిత్యాల/జగిత్యాలజోన్‌: జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు మల్యాల మండలం నూకపల్లి శివారులోని వీఆర్‌కే ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద కోలాహలంగా సాగింది. ఎన్నికల కమిషన్‌ నియమించిన పరిశీలకులతో పాటు, జిల్లా కలెక్టర్‌ యాస్మిన్‌బాషా, అడిషనల్‌ కలెక్టర్‌ లత ఎప్పటికప్పుడు కౌంటింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. అయా పార్టీల ఏజెంట్లు, అధికారులు హాజరయ్యారు. తొలుత ప్రత్యేక టేబుళ్ల ద్వారా అధికారులు పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. అనంతరం రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు. జగిత్యాల 19, కోరుట్ల 19, ధర్మపురి 20 రౌండ్లు ఉండటంతో ఒక్కో రౌండ్‌ ఫలితం వచ్చే సరికి దాదాపు అరగంట పట్టింది. మధ్యాహ్నం భోజన సమయంలో కొద్దిసేపు విరామం ఇచ్చారు. భోజనం తర్వాత కొనసాగించారు. చివరకు రిటర్నింగ్‌ అధికారులు గెలుపొందిన అభ్యర్థులు ధృవీకరణ పత్రాలు అందించారు. కౌంటింగ్‌ కేంద్రంలో అడుగడుగునా బీఎస్‌ఎఫ్‌ పోలీస్‌ బలగాలతో నిఘాతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చిన అభ్యర్థుల్లో చాలామంది వెనుకంజలో ఉండటంతో రౌండ్ల మధ్యలోనే వారివారి ఇళ్లకు వెళ్లిపోవడం గమనార్హం.

1/1

Advertisement
Advertisement