జిల్లాకో రెవెన్యూ బోర్డు | Sakshi
Sakshi News home page

జిల్లాకో రెవెన్యూ బోర్డు

Published Thu, Dec 14 2023 12:26 AM

ఎమ్మెల్సీతో ఉపాధ్యాయ , రెవెన్యూ సంఘం నాయకులు
 - Sakshi

జగిత్యాలజోన్‌: ధరణి సమస్యల పరిష్కారానికి జిల్లాకో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం మాట్లాడుతానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని వీఆర్‌ఎలు, వీఆర్‌ఓలు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎమ్మెల్సీని కలిశారు. వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను తొలగించడం ద్వారా రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, గ్రామస్థాయిలో పాలన లోపించిందని, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, ఆర్‌ఐలే ఉండడంతో భూ సమస్యలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో స్థానికత దెబ్బతిందన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలను భర్తీ చేయాల్సి ఉందన్నారు.

ఫిల్టర్‌బెడ్స్‌ వినియోగంపై సీఎం దృష్టికి

రాయికల్‌: రాయికల్‌, పొలాస, బీర్‌పూర్‌ ఫిల్టర్‌బెడ్‌ల వినియోగంపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ తెలిపారు. పట్టణంలో నిరుపయోగంగా ఉన్న ఫిల్టర్‌బెడ్‌ను బుధవారం పరిశీలించారు. సాగు, తాగునీరు, విద్యుత్‌కు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. రామాజీపేట చెరువును ఎస్సారెస్పీ కెనాల్‌తో అనుసంధానం చేస్తే చాలాగ్రామాల్లో తాగునీటి సమస్య తీరుతుందన్నారు. ఈనెల 17 నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదలకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, మండల నాయకులు గన్నవరం ప్రభాకర్‌, పడిగెల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే

కాంగ్రెస్‌కు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని, ఇందులో భాగంగానే సీఎం బెల్ట్‌షాపులు ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ అన్నారు. బెల్టుషాపుల ఎత్తివేత నిర్ణయానికి మహిళల్లో మంచి స్పందన వస్తోందని గుర్తుచేశారు.

ఉద్యోగులకు స్థానికత కల్పిస్తాం

జగిత్యాలటౌన్‌: 317 జీవో కారణంగా స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం చేస్తామని, ఉమ్మడి పది జిల్లాలను జోన్లుగా ఏర్పాటు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను తమ సొంత జిల్లాలకు చేర్చేలా త్వరలోనే నిర్ణయం ఉండబోతుందని ఎమ్మెల్సీ తెలిపారు. ప్రతి పాఠశాలకు ఒక స్కావెంజర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచుతామన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో ఉపాద్యాయ సంఘం సంఘం నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, ఆనందరావు,ఎన్నం రాంరెడ్డి, మల్లారెడ్డి, విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement