అన్నవరంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు | Sakshi
Sakshi News home page

అన్నవరంలో మంత్రి ఎర్రబెల్లి దంపతులు

Published Fri, Oct 13 2023 1:36 AM

- - Sakshi

పాలకుర్తి: రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామిని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సతీమణి ఉషాదేవితో కలసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి ప్రత్యేక సేవలో పాల్గొన్నా రు. అనంతరం వారికి పూజారులు స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగా ణలో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించి సీఎం కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.

ఉద్యమకారులకు

సముచిత స్థానం కల్పించాలి

జనగామ: బీఆర్‌ఎస్‌లో సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారులు గుజ్జుక రాజు, ఆలూరి రమేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, దామర రవికుమార్‌, ఉల్లెంగుల కృష్ణ, సాయిలు, మేకల మహేష్‌, గద్ద సాయికుమార్‌, కొడిదల పోచ య్య, వంగ ప్రణీత్‌రెడ్డి, దామెర రాజు, కాసర్ల శంకర్‌, ఎండబట్ల రాములు, కాముని వేణు అన్నారు. ఈ మేరకు పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్‌ సమావేశాలకు తమకు ఆహ్వా నం అందడం లేదని, గతంలో మాదిరిగానే అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పదేళ్లుగా జరుగుతున్న అన్యాయాలపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి వివరించగా.. క్రియాశీలకంగా పనిచేస్తున్న ఉద్యమకారులు, సీనియర్లను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు చెప్పారు.

‘పల్లా’ ఎవరో

ప్రజలకు తెలియదు

బచ్చన్నపేట : పట్ట భద్రుల ఎమ్మెల్సీగా రెండుసార్లు గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎవరో ఈ ప్రాంత ప్రజలకు తెలియదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు భృతి ఇస్తామని గత ఎన్నికల సందర్భగా చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదని, ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించలేక పోయిందని అన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చీకటి ఒప్పందం కుదుర్చుకుని నియోజకవర్గాన్ని దోచుకోవడానికి వస్తున్నారని ఆరోపించా రు. జనగామ ప్రాంతంలో ఒక్క డబుల్‌ బెడ్రూం ఇల్లు కూడా పంపిణీ చేయని వారు.. ఇంకా ఏం చేస్తామని ఎన్నికల్లో పోటీ పడుతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు సద్ది సోమిరెడ్డి, బళ్ల శ్రీనివాస్‌, చౌడ రమేష్‌, గద్ద రాజు, రవీంద్రచారి, సంపత్‌, సాంబయ్య, బాలరాజు పలువురు పాల్గొన్నారు.

నిధుల మంజూరుపై విచారణ చేపట్టాలి

జనగామ: జిల్లా అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ నేతలు ని ధులు మంజూరైనట్లు చేసిన ప్రకటనపై విచారణ చేపట్టాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన ట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కుటుంబ పాలనకుచరమగీతం పాడుదాం

దేవరుప్పుల : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కుటుంబపాలనకు చరమగీతం పాడుదామని కాంగ్రెస్‌ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. గురువా రం నల్లకుంటతండాకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా తొర్రూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, ప్రజాస్వామ్యయుత పాలన కోసం కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టాల్సిన ఆవశ్యకత అనివార్యమన్నారు. ఈ కార్యక్రమంలో బానోత్‌ శ్రీనివాస్‌, బానోత్‌ భిక్షపతి, బానోత్‌ నరసింహ, రాయుడు, రవి, జాటోత్‌ సోమ్లా, సుమన్‌, నునావత్‌ రాజు, సాయి, నితిన్‌, వాంకుడోత్‌ సంతోష్‌, అజ్మీరా అనిల్‌ పాల్గొన్నారు.

1/1

Advertisement
Advertisement