ఉచిత న్యాయ సహాయం | Sakshi
Sakshi News home page

ఉచిత న్యాయ సహాయం

Published Thu, Nov 9 2023 1:54 AM

-

జడ్జిలు రవీంద్రశర్మ, విక్రమ్‌

జనగామ రూరల్‌ : ఆబ్జెక్ట్‌ ఆఫ్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ 1987లో ఏర్పడింది.. దీని ద్వారా సమాజంలో బలహీన వర్గాల పేదలకు ఉచిత న్యాయ సహాయం అందుతుందని జిల్లా జడ్జి డి.రవీంద్రశర్మ, సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.విక్రమ్‌ పేర్కొన్నారు. నల్సార్‌ మార్గదర్శకత్వంలో లిటిగేటివ్‌ దశలో ఉన్న విషయాల పరిష్కారానికి న్యాయ సేవా సంస్థ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 9న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని సమస్యలను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే.. లీగల్‌ సర్వీస్‌ డే ను విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement