బాణసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి | Sakshi
Sakshi News home page

బాణసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి

Published Thu, Nov 9 2023 1:54 AM

సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ సీతారాం - Sakshi

డీసీపీ సీతారాం

జనగామ రూరల్‌: బాణసంచా విక్రయ దుకాణా దారులు నిబంధనలు పాటించాలని డీసీపీ సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో పట్టణ పరిధి బాణసంచా దుకాణాదారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి పండుగను పురస్కరించుకొని షాపులు ఏర్పాటు చేసే నిర్వాహకులకు ఈ సందర్భంగా విధి విధానాలు, తీసుకోవాల్సిన అనుమతులు, జాగ్రత్త చర్యలను వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement