పట్టుబడిన మద్యం, నగదు నివేదిక పంపించాలి | Sakshi
Sakshi News home page

పట్టుబడిన మద్యం, నగదు నివేదిక పంపించాలి

Published Sat, Nov 11 2023 1:40 AM

బచ్చన్నపేట చెక్‌ పోస్టును పరిశీలిస్తున్న రాజమణి  - Sakshi

బచ్చన్నపేట: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల వద్ద అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం, నగదు వివరాల నివేదికను ఎప్పటికప్పుడు పంపించాలని జనగామ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు కె.రాజమణి(ఐఏఎస్‌) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గోపాల్‌నగర్‌ గ్రామ ప్రధాన చౌరస్తా, కొన్నె క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పో స్టును స్టాటిక్‌ సర్వేలైన్స్‌ టీం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు సీజ్‌ చేసిన అక్రమ మద్యం, డబ్బు తదితర వివరాల రిజిస్ట్రర్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల నియమ నిబంధనల మేరకు చెక్‌ పోస్టుల వద్ద 24 గంటలు తనిఖీ చేపట్టాలని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ప్రతి వాహనాన్నీ సోదా చేయాలని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఫిర్యాదు చేయాల్సి వస్తే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌ రూంలో సంప్రదించాలని, నేరుగా ఫిర్యాదు చేసే వారు 8121278146 నంబర్‌కు తెలపాలని సూచించారు.

ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజమణి

Advertisement
Advertisement