మైనార్టీలకు పెద్ద పీట | Sakshi
Sakshi News home page

మైనార్టీలకు పెద్ద పీట

Published Tue, Nov 14 2023 1:18 AM

మాట్లాడుతున్న మహమూద్‌ అలీ, పక్కన ‘పల్లా’ - Sakshi

జనగామ: కాంగ్రెస్‌.. దేశం, రాష్ట్రంలో ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంది.. ఆ పార్టీ నిర్ణయాలతో మైనార్టీలు ఆర్థింగా ఎదగలేక పోయారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. జనగామ మండలం పసరమడ్ల శివారు ఉషోదయ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం స్టేట్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎండీ.ఖాజాఆరిఫ్‌ అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో మా ట్లాడారు. కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముస్లింల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, విద్య, వైద్యం ఇలా అనేక రంగాల్లో పెద్దపీట వేసినట్లు చెప్పారు. దశాబ్ద కాలంగా మత ఘర్షణ లు, ఉద్రిక్తతలకు తావులేకుండా పాలన సాగించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 204 మైనారిటీ రెసిడెన్షియల్‌ గురుకులాలు ఏర్పా టు చేసి ముస్లిం పేద బిడ్డలకు ఉన్నత విద్య అందించడమే కాకుండా.. వారి సంక్షేమానికి రూ.4వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలి పించాలని కోరారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ య్య మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తేవాలని కోరా రు. అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహానికి కేసీఆర్‌ షాదీముబారక్‌, మైనారిటీల పిల్లలకు కార్పొరేట్‌ విద్య, యువత విదేశాల్లో చదువుకు రూ.5లక్షల సాయం ఇలా అనే కం చేసినట్లు పేర్కొన్నారు. స్టేట్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్‌ ఇషాక్‌, ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డ్‌ చైర్మన్‌ యూసఫ్‌ జాహిజ్‌, మసిఉర్‌ రెహమాన్‌, ఏజాజ్‌ అహ్మద్‌, ఎండీ.సమ్మద్‌, యాకూబ్‌, అన్వర్‌, జానీ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ ఆర్థిక వనరులు పెంచింది

జనగామ అభ్యర్థి ‘పల్లా’ను గెలిపించండి

రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ

Advertisement
Advertisement