విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలి | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలి

Published Sun, Nov 19 2023 1:38 AM

జాహ్నవిని సన్మానిస్తున్న ఉపాధ్యాయ బృందం - Sakshi

నర్మెట: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడు ఉపేందర్‌ సూచించా రు. స్థానిక మోడల్‌ స్కూల్‌లో శనివారం ఏర్పాటు చేసిన పేరెంట్స్‌, టీచర్స్‌ మీటింగ్‌లో ఆయన మా ట్లాడారు. తల్లితండ్రులు పిల్లలకు ఇంటివద్ద స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడంతోపాటు వారి నడవడిని గమనిస్తూ సూచనలు అందించాలన్నా రు. ఈ సందర్భంగా చిత్రలేఖనంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న టెన్త్‌ విద్యార్థిని బైరోజు జాహ్నవితో పాటు ఆమెను ప్రోత్సహిస్తున్న తండ్రి ని సన్మానించారు. సెక్టోరియల్‌ అధికారులు నర్సింహారావు, రమేష్‌, ప్రిన్సిపాల్‌ శరత్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సదానందం పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలి

జఫర్‌గఢ్‌: విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించాల ని ఉమ్మడి వరంగల్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరిశీలకులు రాఘవులు, శ్యాంసుందర్‌, మండల నోడల్‌ ఆఫీసర్‌ పర్వే జ్‌ అన్నారు. కూనూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రగతిని వారు శనివారం పరిశీలించారు. అనంతరం పేరెంట్స్‌ సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు నిత్యం పాఠశాలకు హాజరయ్యేలా తల్లి దండ్రులు ప్రోత్సహించాలన్నారు. హెచ్‌ఎం సురేందర్‌, ఉపాధ్యాయులు సురేష్‌రెడ్డి, సోమయ్య, శ్రీని వాస్‌, మధన్‌మోహన్‌రెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడు ఉపేందర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement