నిట్‌లో ఘనంగా ప్రీ క్రిస్మస్‌ | Sakshi
Sakshi News home page

నిట్‌లో ఘనంగా ప్రీ క్రిస్మస్‌

Published Sun, Nov 19 2023 1:38 AM

-

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లోని ఆడిటోరియంలో శనివారం విద్యార్థులు నిట్‌మాస్‌–23 పేరిట ముందస్తు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిట్‌లో సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌, తర్వాత సెలవులు ఉండడంతో క్రిస్మస్‌ పండుగకు కళాశాలలో అందుబాటులో ఉండని సందర్భంగా ఈవేడుకలు జరుపుకున్నట్లు విద్యార్థులు తెలిపారు. రాబోయే క్రిస్మస్‌ సందర్భంగా ఏసు క్రీస్తు జననం, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ జింగిల్‌ బెల్‌.. జింగిల్‌ బెల్‌ అంటూ పాటలతో అలరించారు. నిట్‌మాస్‌–23 వేడుకల్లో భాగంగా క్రిస్మస్‌ కేక్‌ను కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నిట్‌ డీన్‌లు శ్రీనివాసాచార్య, ఎడ్వర్డ్‌ విలియమ్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement