నేడు ఘన్‌పూర్‌కు సీఎం కేసీఆర్‌ రాక | Sakshi
Sakshi News home page

నేడు ఘన్‌పూర్‌కు సీఎం కేసీఆర్‌ రాక

Published Mon, Nov 20 2023 1:16 AM

- - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి వస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘన్‌పూర్‌ మండలం చాగల్లు శివారు శివారెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం హెలికాప్టర్‌లో ఇక్కడికి చేరుకుంటారని, సభాస్థలి, హెలిపాడ్‌ వద్ద అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. సభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతున్నట్లు వివరించారు.

జనగామకు అమిత్‌షా...

జనగామ:అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు (సోమవారం) జనగామ జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు ప్రెస్టన్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు బతుకమ్మకుంటలోని హెలిపాడ్‌ వద్ద ల్యాండింగ్‌ అయి, అక్కడ నుంచి నేరుగా సభావేదిక వద్దకు చేరుకుంటారు. డీసీపీ పి.సీతారాం ఆధ్వర్యంలో ఏసీపీ దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో సీఐ ఎలబోయిన శ్రీనివాస్‌ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. జనగామ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి, పలువురు నాయకులు ఆదివారం వేదిక, సభాస్థలి, హెలిపాడ్‌ను పరిశీలించారు.

శ్రవణ నక్షత్ర హోమం

చిల్పూరు: చిల్పూరు గుట్ట బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యు ల వేద మంత్రాల నడుమ కార్తీక మాస శ్రవణ నక్షత్ర హోమ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్‌ శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన మండల రైతు కోఆర్డినేటర్‌ జనగామ యాదగిరి–లక్ష్మి దంపతులు భక్తులకు అన్న ప్రసాదం అందజేశారు. సిబ్బంది రమేష్‌, వీర న్న, మళ్లికార్జున్‌, లక్ష్మి, స్వరూప, కృష్ణ, మహేష్‌, హరిశంకర్‌, రాజేష్‌, విశాల్‌, శేఖర్‌, అజయ్‌, రాములు, వసంత తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌టీయూ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

జనగామ: జనగామ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశం, ఎన్నికల నేపధ్యంలో ఎలక్షన్‌ అధికారులుగా వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని రమేష్‌, పరిశీలకులు ఆర్‌.సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడిగా ఆర్‌.రాధాకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యం.నర్సింహయ్య, అసోసియేట్‌ అధ్యక్షుడిగా నర్సింహ్మరెడ్డి, ఆర్థిక కార్యదర్శి లింగమూర్తి, జిల్లా ఉపాధ్యాక్షులుగా భాను ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బి.రవి, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఎ.సదయ్య, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమేశ్‌, నాగరాజు పాల్గొన్నారు.

మద్యం పట్టివేత

స్టేషన్‌ఘన్‌పూర్‌: సాధారణ ఎన్నికల నేపథ్యంలో రోజువారీగా చేస్తున్న తనిఖీల్లో భాగంగా డివిజన్‌ కేంద్రంలోని బస్టాండ్‌ సమీపాన అక్రమంగా తరలిస్తున్న రూ.26 వేలు విలువైన మద్యం ఆదివారం పట్టుకున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ భాస్కర్‌రావు తెలిపారు. స్థానిక బస్టాండ్‌ వద్ద ఎకై ్సజ్‌ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా చాడ తిరుపతి అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో మద్యం తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ నరేష్‌, కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, దస్తగిరి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement