లెదర్‌పార్కును వినియోగంలోకి తేవాలి | Sakshi
Sakshi News home page

లెదర్‌పార్కును వినియోగంలోకి తేవాలి

Published Tue, Nov 28 2023 2:12 AM

- - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రభుత్వాలు మారినా ఏళ్ల తరబడి చర్మకారుల తలరాతలు మారడం లేదు.. ఈ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక మినీ లెదర్‌పార్కును వినియోగంలోకి తీసుకువచ్చి చర్మకారులకు ఉపాధి కల్పించాలని తెలంగాణ చర్మకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె కుమారస్వామి, ఉపాధ్యక్షుడు అనంతపురం చంద్రమౌళి డిమాండ్‌ చేశారు. చర్మకారుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సంఘం మండల అధ్యక్షుడు జీడి యాకూబ్‌ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై చెప్పులు, బూట్లను పాలిష్‌ చేస్తూ నిరసన తెలిపారు. సంఘం జిల్లా అఽధ్యక్షుడు రాజారపు మల్లేశం, ఉపాధ్యక్షుడు మారపాక శ్రీనివాస్‌, గాదె ఈశ్వరయ్య, స్వరూప, సుధ, సులోచన తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌/జఫర్‌గఢ్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి ఓటు వేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ, ఉపాధ్యక్షుడు బాదావత్‌ రాజు, ప్రధాన కార్యదర్శి దిలీప్‌ కోరారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌లో ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన కార్యక్రమంలో కరపత్రాలు పంచి న అనంతరం వారు మాట్లాడారు. రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని, ప్రలోభాలకు లోనుకాకుండా సరైన నాయకుడి ని ఎన్నుకోవడానికి వినియోగించాలని కోరారు. వేదిక నాయకులు టి.హరికృష్ణ, వి.దిలీప్‌, పాలకుర్తి శ్రీనివాస్‌, హనుమాన్‌ ప్రసాద్‌, పద్మజ, సంపత్‌, సురేందర్‌, కల్పన తదితరులు పాల్గొన్నారు.

మోడల్‌ స్కూల్‌ టీచర్‌కు డాక్టరేట్‌

జఫర్‌గఢ్‌: మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ జువాలజీ ఉపాధ్యాయురాలు జి.జ్యోత్స్నకు నాగార్జున విశ్వ విద్యాలయం ఎడ్యుకేషన్‌ విభాగం డాక్టరేట్‌ ప్రకటించింది. ఈ మేరకు వర్సిటీలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పట్టా అందుకున్నారు. జ్యోత్స్న ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తూనే పిల్లల మానసిక స్థితిగతులపై నాగార్జున వర్సిటీలో డాక్టర్‌ షకీలా పర్యవేక్షణలో పరిశోధనలు సాగించారు.

సంఘం ప్రధాన కార్యదర్శి కుమారస్వామి

Advertisement
Advertisement