సముచిత స్థానం | Sakshi
Sakshi News home page

సముచిత స్థానం

Published Tue, Nov 28 2023 2:18 AM

- - Sakshi

మంగళవారం శ్రీ 28 శ్రీ నవంబర్‌ శ్రీ 2023

– వివరాలు 6లోu

సకల

జనులకు

సాక్షి, మహబూబాబాద్‌/ మహబూబాబాద్‌/ మహబూబాబాద్‌ అర్బన్‌: ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కురవి వీరభద్ర స్వామి మందిరానికి శ్రద్ధాపూర్వక నమస్కారాలు.. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నాను. ఈ ప్రాంతం, రాష్ట్ర ప్రజలు బాగుండాలని కోరుకుని ఇక్కడికి వచ్చా.. ప్రజలు జనతా జనార్దనులు, ఈశ్వర సమానులు.. సభకు మీరందరూ రావడం సతోషం.. ఇక్కడ నూతన శకం ప్రారంభం కానుంది.. మహబూబాబాద్‌ ప్రాంతానికి సేవాలాల్‌ మహరాజ్‌ సమర్పణ తపస్సు ఫలం లభించింది.. సేవాలాల్‌ మహరాజ్‌కీ జై..’ అంటూ దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించి ప్రజలను ఉత్తేజ పరిచారు. బీజేపీ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తోందని, సకల జనులకు సముచిత స్థానం లభిస్తోందని అన్నారు. సోమవారం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి హుస్సేన్‌ నాయక్‌తోపాటు డోర్నకల్‌, నర్సంపేట, ఇల్లెందు, పినపాక, భద్రాచలం అభ్యర్థులు భూక్య సంగీత, పుల్లారావు, రవీంద్రనాయక్‌, బాలరాజు, కుంజ ధర్మాను బలపరుస్తూ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. సభకు ప్రధాని మోదీ హాజరై బీజేపీ ప్రభుత్వాన్ని బలపర్చాలని, అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించా. పలువురు ప్రముఖులతో మాట్లాడా. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు’ అని అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని, తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు. నవంబర్‌ 30వ తేదీన ప్రజలువేసే ఓట్లతో ముఖ్యమంత్రి ఓడిపోతున్నారన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జైలుకు పంపించేది బీజేపీ ప్రభుత్వం ఒక్కటే అన్నారు. సభలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాజవర్ధన్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌ రెడ్డి, రవీంద్రనాయక్‌, బాలరాజు, ధర్మారావు, ప్రేమేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రాంచంద్రు, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

అవకాశం ఇస్తే మార్పు చేసి చూపిస్తా: హుస్సేన్‌ నాయక్‌

ఒక్కసారి తనకు అవకాశం కల్పిస్తే మానుకోట నియోజకవర్గం మార్పు చేసి చూసిస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్‌ఎస్‌ పది సంవత్సరాల కాలంలో దోపిడీ, అరాచకాలు పెరిగాయని, దీంతోపాటు భూకబ్జాలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్లేనన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత పీఎం మోదీది అన్నారు.

బీఆర్‌ఎస్‌ అరాచక పాలనకు చరమగీతం పాడాలి: భూక్య సంగీత

డోర్నకల్‌ నియోజకవర్గంలో రెడ్యానాయక్‌ కుటుంబ పాలన సాగుతోందని బీజేపీ అభ్యర్థి భూక్య సంగీత అన్నారు. రెడ్యానాయక్‌ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. 40 ఏళ్లు ప్రజా ప్రతినిధిగా ఉన్న రెడ్యానాయక్‌ డోర్నకల్‌ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. రెండు సార్లు జెడ్పీటీసీగా గెలిపించిన మీరు ఈ సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

మానుకోటలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరైన జనం, అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

సైడ్‌లైట్స్‌..

● ప్రధాని మోదీ మానుకోట సభా ప్రాంగణానికి మధ్యాహ్నం 12.49 గంటలకు చేరుకోగా 12.51కి హెలికాప్టర్‌ ల్యాండ్‌ అయింది.

● మధ్యాహ్నం 1.02 గంటలకు మోదీ వేదికపైకి చేరుకున్నారు. 1.13 నుంచి 1.50 గంటల వరకు ప్రసంగించారు.

● ఇప్పటివరకు మానుకోటకు పీఎం హోదాలో మోదీ మాత్రమే వచ్చారు. గతంలో ఇందిరాగాంధీ వచ్చినప్పటికీ ఆమె అప్పుడు పీఎం హోదాలో లేరు.

● మోదీ రాకతో భారత్‌మాతాకీ జై, జైశ్రీరాం నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

● వేదికపై మొదట బీజేపీ డోర్నకల్‌ అభ్యర్థి సంగీత పీఎం మోదీకి శాలువా కప్పి సన్మానించి నమస్కరించారు. ఆమెకు పీఎం తిరిగి నమస్కరించారు. తర్వాత మానుకోట అభ్యర్థి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ కూడా మోదీని శాలువాతో సత్కరించి శ్రీరాముడి చిత్రపటం బహూకరించారు.

● చాలామంది వ్యాపారులు, మార్వాడీలు దుకాణాలను బంద్‌ చేసి కటుంబసభ్యులతో కలిసి మోదీ సభకు తరలివచ్చారు.

● పట్టణానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ ప్రముఖ నాయకులు కూడా పీఎంను చూడడానికి రావడం గమనార్హం.

గిరిజనులు, ఆదివాసీలకు బీజేపీ ప్రాధాన్యం

కురవి వీరభద్రుడి ఆశీస్సులు కోరుతున్నా

తెలంగాణ ప్రజలు కమలం వైపు

చూస్తున్నారు..

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటే

మానుకోట సకల జనుల విజయ

సంకల్ప సభలో ప్రధాని మోదీ

తెలుగులో ప్రసంగం ప్రారంభం..

పార్టీ శ్రేణుల్లో జోష్‌

ఒక్క చాన్స్‌ ఇస్తే మార్పు చూపిస్తా: హుస్సేన్‌నాయక్‌

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement
Advertisement