ఘనంగా న్యాయ సేవల దినోత్సవం | Sakshi
Sakshi News home page

ఘనంగా న్యాయ సేవల దినోత్సవం

Published Fri, Nov 10 2023 5:22 AM

- - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ సెంటర్‌ నుంచి జిల్లా కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద, బలహీన వర్గాలవారికి, చిన్న పిల్లలకు, మహిళలకు న్యాయసేవాధికార సంస్థ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జయరాంరెడ్డి, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాంచంద్రారావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏదులాపురం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, అన్ని కోర్టుల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

విద్యార్థుల ఎంపిక

కాటారం: 67వ ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో కాటారం గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. హ్యాండ్‌బాల్‌ అండర్‌–19 విభాగం సెలక్షన్స్‌లో కళాశాలకు చెందిన జితేందర్‌, నరేశ్‌, వంశీ, శేషు అంత్యంత ప్రతిభ కనబర్చారు. దీంతో సెలక్షన్‌ కమిటీ సభ్యులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేశారు. నేడు(శుక్రవారం) నుండి ఆదివారం వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ జేకే బుచ్చయ్య తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేందర్‌, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ సిరిసిల్ల శ్రీనివాస్‌, పీడీ మంథెన శ్రీనివాస్‌, పీఈటీ సతీశ్‌, కోచ్‌ వెంకటేశ్‌, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: బొగ్గు నాణ్యత వారోత్సవాలను ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో గురువారం ప్రారంభించి క్వాలిటీ పతాకాన్ని ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తితో అధిక రాబడులు తెచ్చే అవకాశం ఉంటుంన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం వెంకటయ్య, క్వాలిటీ డీజీఎం కవీంద్ర, అధికారులు జ్యోతి, తుకారాం పాల్గొన్నారు.

చండ్ర పుల్లారెడ్డి పోరాటం మరువలేనిది..

ములుగు రూరల్‌: భూమి కోసం, భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం వీరమరణం పొందిన చండ్ర పుల్లారెడ్డి పోరాటం మరువలేనిదని సీపీఐ ఎంఎల్‌ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో చండ్ర పుల్లారెడ్డి 39వ వర్థంతిని ఆ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, గిరిజన, బహుజనుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహించి ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను కొనసాగించాలన్నారు.

1/1

Advertisement
Advertisement