వాతావరణం | Sakshi
Sakshi News home page

వాతావరణం

Published Fri, Nov 17 2023 1:26 AM

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు - Sakshi

జిల్లాలో ఉదయం మంచు కురుస్తుంది. మధ్యాహ్న సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రి పూట మంచు కురుస్తుంది.

ఎన్నికల వ్యయ రిజిస్టర్లు

సమర్పించాలి

భూపాలపల్లి అర్బన్‌: ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న అభ్యర్థులు వ్యయ సంబంధిత రిజిస్టర్లు సమర్పించాలని రిటర్నింగ్‌ అధికారి రమాదేవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 23మంది అభ్యర్థులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్లు పరిశీలిస్తారన్నారు. పార్ట్‌–అ, పార్ట్‌–ఆ, పార్ట్‌–ఇలను ఈ నెల 20నుంచి 24వరకు, 27వ తేదీన ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పరిశీలన కోసం వ్యయ పరిశీలనాధికారికి సమర్పించాలన్నారు. ఎన్నికలలో పోటీదారులు ఎవరైనా వేరే రికార్డులను సమర్పించడంలో విఫలమైతే ప్రజాప్రతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 77 ప్రకారం వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఓటుహక్కును

వినియోగించుకోవాలి

రేగొండ: అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భూపాలపల్లి డీఎస్పీ రాములు సూచించారు. గురువారం మండలకేంద్రంలో సివిల్‌, సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ వేణుచందర్‌, ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌, సాంబమూర్తి, రమేష్‌, శ్రీధర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రిటర్నింగ్‌ అధికారి రమాదేవి

Advertisement

తప్పక చదవండి

Advertisement