సమ్మెతోనే హక్కుల సాధన | Sakshi
Sakshi News home page

సమ్మెతోనే హక్కుల సాధన

Published Thu, Dec 14 2023 1:08 AM

సమ్మె చేస్తున్న తపాలా సిబ్బంది   - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: సమ్మెతోనే హక్కుల సాధన జరుగుతుందని ఆల్‌ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం భూపాలపల్లి సబ్‌ పోస్టాఫీస్‌ బాధ్యుడు గోగు లక్ష్మినారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సబ్‌ పోస్టాఫీస్‌ ఎదుట సిబ్బంది చేపడుతున్న దేశ వ్యాప్తగా సమ్మె బుధవారం నాటికి రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేష్‌ చంద్ర కమిటీ అనుకూల సిఫార్సులను అమలు చేయాలన్నారు. ఆర్థిక ఉన్నతి కోసం పొందాల్సిన ఇంక్రిమెంట్లు పొందకుండానే వేలాదిమంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 లక్షల గ్రాట్యుటి వర్తింపు, ఇన్సూరెన్స్‌ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సబ్‌ పోస్టాఫీస్‌ పరిధి లోని బీపీఎంలు, ఏబీపీఎంలు శివశంకర్‌, రఘు, నిర్మల, వెంకటేష్‌, శ్రావణ్‌కుమార్‌, రాజేష్‌, ప్రవీణ్‌, ప్రశాంత్‌, రఘు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement