అమ్మానాన్నకు వివరిస్తా | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నకు వివరిస్తా

Published Fri, Nov 10 2023 5:22 AM

- - Sakshi

తొలిసారి ఓటుహక్కు వచ్చింది. ఈ సారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఓటు విలువ గురించి మా ఇంట్లో తల్లిదండ్రులకు తెలియజేస్తాను. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గాకుండా స్వేచ్ఛాయుతంగా ఓటును వినియోగించుకునేలా నా వంతు కృషి చేస్తా.

– గంగోత్రి, బీఎస్సీ సెకండియర్‌

అవగాహన అవసరం

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతపై చాలా మందికి ఆవగాహన లేదు. ఓటు విలువ, వినియోగం, అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. కేవలం టీవీలు, రెడియోలు, పత్రికల ద్వారా కాకుండా నిపుణుల చేత ఆవగాహన కల్పిస్తే మెరుగైన సమాజానికి దోహదం చేస్తోంది.

– ఉమేరా, బీఎస్సీ ఎంపీసీఎస్‌ ఫైనలియర్‌

అందుబాటులో ఉండాలి

నం ఓట్లు వేస్తే గెలిచే నాయకులు మనకు నిత్యం అందుబాటులో ఉండి మన ప్రాంత అభివృద్ధికి, నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలి. అలాంటి నాయకులను ఎన్నుకోవాలంటే మనం ఓటును నిజాయితీగా వేయాలి.

– నవ్యశ్రీ, బీఎస్సీ ఎంపీసీఎస్‌, సెకండియర్‌

ఎన్నికలప్పుడే హడావుడి

న్నికలొచ్చినప్పుడు మాత్రమే లీడర్లు పనులు చేస్తారు. పదేళ్ల కిందట వేయాల్సిన సీసీ రోడ్డును అలాగే వదిలేశారు. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మా కాలనీకి సరైన రోడ్డు సౌకర్యం లేనందున చెత్త బండి కూడా వచ్చేది కాదు. మా కాలనీ ప్రజాప్రతినిధి కూడా అందుబాటులో ఉండడు. ఇలాంటి పరిస్ధితి పోవాలంటే నిజాయితీగా వేస్తేనే లీడర్‌ను గట్టిగా నిలదీయవచ్చు. – మదీయా,

బీఎస్సీ, సెకండియర్‌

1/3

2/3

3/3

Advertisement
Advertisement