ఎన్నికల ఖర్చు వివరాలు నమోదు చేయాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఖర్చు వివరాలు నమోదు చేయాలి

Published Sat, Nov 18 2023 1:42 AM

మాట్లాడుతున్న జిల్లా వ్యయ పరిశీలకుడు సమీర్‌ కుమార్‌ ఝా   - Sakshi

గద్వాల రూరల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆభ్యర్ధులు ఎన్నికల ఖర్చుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని రిటర్నింగ్‌ అధికారి, అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గద్వాల నియోజకవర్గ ఎన్నికల అఽభ్యర్ధుల ఎన్నికల ఖర్చు నమోదు, బ్యాంకు ఖాతా నిర్వాహణ, తదితర నిబంధనలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఆవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి అపూర్వ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఆభ్యర్థులు తమ ఖర్చుల వివరాలు పార్ట్‌–ఏ, పార్ట్‌–బీ, పార్ట్‌–సీ కాలమ్స్‌ పూర్తిగా ఫిలప్‌ చేయాలని, అనుమతి లేకుండా ఆభ్యర్ధి పోస్టర్లు, జెండాలు, కరపత్రాలు పంచితే వారిపై 171హెచ్‌ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒక్కో ఆభ్యర్ధి రూ.40లక్షలకు మించి ఖర్చుకు వీలుంటుందని, అంతకు మించి చేస్తే పార్ట్‌–ఏలో అన్ని ఖర్చులకు సంబంధించిన రికార్డులను నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో గద్వాల ఎన్నికల వ్యవయ పరిశీలకులు విజయ్‌ భాస్కర్‌, సహయ పరిశీలకులు నారాయణ, వివిధ పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు.

పటిష్ట నిఘా ఉంచాలి

ఎన్నికల సమయంలో అక్రమ కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా వ్యయ పరిశీలకులు సమీర్‌ కుమార్‌ ఝ అన్నారు. శుక్రవారం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఏర్పాటైన ఎస్‌ఎస్‌టీఎఫ్‌ఎస్‌టీ బృందాల పనితీరును ఆయన పరిశీలించారు. బీచుపల్లి, అలంపూర్‌ చెక్‌పోస్టుల వద్ద స్టాటిస్టిక్స్‌ సర్విలెన్స్‌ బృందాల పనితీరును పర్యవేక్షించారు.

Advertisement
Advertisement