ఈవీఎంలు కమిషనింగ్‌ చేసి సిద్ధంగా ఉంచాలి | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు కమిషనింగ్‌ చేసి సిద్ధంగా ఉంచాలి

Published Fri, Nov 24 2023 1:18 AM

-

అలంపూర్‌: ఎన్నికలకు ఈవీఎంల కమిషనింగ్‌ పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. అలంపూర్‌ చౌరస్తా మార్కెట్‌యార్డులో నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ వల్లూరు క్రాంతి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఈవీఎంలు, సీయూ, బీయూ, వీవీ ప్యాట్‌ల కమిషనింగ్‌ను ఈవీఎంల ఇంజినీర్లతో కలిసి కమిషనింగ్‌ చేసే విధానాన్ని పరిశీలించారు. 31 టేబుల్స్‌ను ఏర్పాటు చేసి పీఓ, ఏపీఓలు 31 మంది సెక్టోరియల్‌ అధికారులు పంపిణీకి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అలంపూర్‌ నియోజకవర్గంలో 290 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన 362 కంట్రోల్‌ యూనిట్లు 362 బ్యాలెట్‌ యూనిట్లు కమిషనింగ్‌ చేసినట్లు వివరించారు. అదేవిధంగా మానవపాడులోని జెడ్పీహెచ్‌ఎస్‌లోని పోలింగ్‌ బూత్‌ 216 నుంచి 220 వరకు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇటిక్యాల మండలంలోని కోదండాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లోని 34, 35 పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement