జిల్లాలో 144 సెక్షన్‌ అమలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో 144 సెక్షన్‌ అమలు

Published Thu, Nov 30 2023 12:54 AM

-

గద్వాల రూరల్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్‌ అమలు ఉంటుందని, ప్రజలు గుంపులు, గుంపులుగా ఐదుగురు కంటే ఎక్కువ ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా డబ్బు, మద్యం ఉచిత కానుకల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడంతో పాటు ఓటర్లను ఎవరైనా భయబ్రాంతులకు గురి చేయకూడదని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లను ఉచిత రవాణా నిషేధమని, ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కి 48 గంటల ముందు రాజకీయ పార్టీలు ఉద్దేశంతో కూడిన సందేశాలు, ఆడియో మెసేజ్‌లు సోషల్‌ మీడియా ద్వారా పంపెవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల అవతల వాహనాలను పార్క్‌ చేయాలని, దివ్యాంగులకు వీల్‌చైర్‌ మాత్రమే అనుమతిచబడుతుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు అనుమతి నిషేధమని, ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ వద్ద పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్‌ సందర్భంగా ఓటర్లకు భద్రత రీత్యా ఎలాంటి సమస్యలు ఎదురైతే డయల్‌ 100కి ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు.

Advertisement
Advertisement