నోటా వారి మాట! | Sakshi
Sakshi News home page

నోటా వారి మాట!

Published Thu, Dec 7 2023 12:28 AM

-

ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీఎన్నికల్లో నోటాకు భారీగా ఓట్లు

పలుచోట్ల పోస్టల్‌ బ్యాలెట్లలో సైతం..

114 మంది అభ్యర్థులకు నోటా కంటేతక్కువ వచ్చిన వైనం

● అలంపూర్‌ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా, నోటాకు 2,003 ఓట్లు ఈవీఎంలలో, 10 మంది పోస్టల్‌ బ్యాలెట్‌లో నోటాకు ఓటును వేశారు. ఇక్కడ సైతం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు అత్యధికంగా ఓట్లు పోలవగా, బీజేపీ అభ్యర్థికి నోటా కంటే 2వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. మిగిలిన 9 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువే పోలయ్యాయి.

● దేవరకద్ర అసెంబ్లీకి 12 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. నోటాకు 1,705 ఓట్లు ఈవీఎంలలో, ఒక పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పార్టీ అభ్యర్థులు ముగ్గురికి తప్ప మిగిలిన వారికి ఓట్లు నోటాను దాటలేదు. బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 1,909 ఓట్లు వచ్చాయి.

● అచ్చంపేట నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. నోటాకు ఈవీఎంలలో 2,830 ఓట్లు పోలవ్వగా, పోస్టల్‌ బ్యాలెట్‌లో 3 ఓట్లు వచ్చాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ తప్ప మిగిలిన 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి.

Advertisement
Advertisement