చర్యలకు తడబాటు | Sakshi
Sakshi News home page

చర్యలకు తడబాటు

Published Wed, Dec 20 2023 12:32 AM

ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్నిప్రమాదంలో డీపీఓ ఆఫీసు (ఫైల్‌)
 - Sakshi

బుధవారం శ్రీ 20 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

వివరాలు 8లో u

జోగుళాంబ

సన్నిధిలో అడిషనల్‌ ఎస్పీ

జోగుళాంబ శక్తిపీఠం: అష్టాదశ శక్తిపీఠాల్లో అయిదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాలను మంగళవారం అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌ చిన్నకృష్ణయ్య, ఈఓ పురేందర్‌కుమార్‌ వారికి ఆలయ అర్చకులతో కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వర స్వామివారికి బిల్వార్చనలు, జోగుళాంబ అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ, ప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో వారిని సత్కరించారు.

స్కాలర్‌షిప్‌కు

దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల అర్బన్‌: దేశంలో ఎంపిక చేయబడిన 265 విద్యాసంస్థల్లో ఉన్నత విద్యనభ్యస్తున్న జిల్లాలోని గిరిజన విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద ఫ్రెష్‌, రిన్యూవల్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన ఆభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివ రాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. జిల్లా లోని గిరిజనులు వినియోగించుకోవాలన్నారు.

క్వింటాల్‌ వేరుశనగ రూ.7,686

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు మంగళవారం 1301 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. గరిష్టంగా రూ.7,686, కనిష్టంగా రూ.3,173, సరాసరి రూ.4,860 ధరలు పలికాయి. 74 క్వింటాళ్ల ఆముదం రాగా.. గరిష్టంగా రూ.5,470, కనిష్టంగా రూ.5,310, సరాసరి రూ.5,460 ధరలు వచ్చాయి. 1157 క్వింటాళ్ల వరి(సోన) రాగా గరిష్టంగా రూ.3,460, కనిష్టంగా రూ.1,467, సరాసరి రూ.2,286 ధరలు పలికాయి. 39 క్వింటాళ్ల వరి(హంస) రాగా.. గరిష్టం, కనిష్టం, సరాసరి రూ.1,410 పలికింది.

21న ‘సృజన

టెక్‌ఫెస్ట్‌–2023’

కోస్గి: విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యతను పెంపొందించడంతో పాటు పరిశోధనలపై ఆసక్తి పెంచాలనే లక్ష్యంతో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 21న ‘సృజన టెక్‌ఫెస్ట్‌–2023’ పేరుతో వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పరమేశ్వరి, మెకానికల్‌ విభాగాధిపతి సత్యయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

గద్వాల రూరల్‌: నడిగడ్డ అక్రమాలకు.. అడ్డాగా మారింది. ఓవైపు ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా.. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం.. ఇంకోవైపు కల్లు దుకాణాల అనుమతుల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలు ఇలా చెప్పుకొంటూ పోతే లిస్టు పెద్దగా ఉంటుంది. ఇది ఇక్కడి జిల్లా ఉన్నతాధికారులకు కనిపించడం లేదు. ఇటీవల నూతనంగా మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన జూపల్లి గద్వాలలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో ఈ సంఘటనలు వరుసగా వెలుగులోకి వచ్చాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటుంటే చర్యలకు ఉపక్రమించి అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా ఉన్నతాధికారులు వెనుకంజ వేయడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా వివాదాస్పదంగా మారిన కల్లు దుకాణాల వ్యవహారం నేపథ్యంలో సోమవారం ఎకై ్సజ్‌శాఖ అధికారులు హైదరాబాద్‌లో మంత్రి జూపల్లితో ప్రత్యేకంగా భేటీ కావడంతో గద్వాలలో అక్రమార్కుల్లో కలకలం రేపుతుంది.

మిల్లర్లపై చర్యలకు వెనుకంజ..

గతేడాది 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి చోటుచేసుకున్న అక్రమాలపై సదరు మిల్లర్లకు నోటీసులు జారీచేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. అయితే ఇటీవల ఇదే అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా సమీక్షలో సివిల్‌ సప్లయ్‌ శాఖ డీఎస్‌ఓ రేవతిని నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అటు మిల్లర్లు, ఇటు అధికారుల్లో ఏవైపు నుంచి ఎలాంటి ఉరుము వచ్చి మీదపడుతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.

కార్యాలయాలకే నిప్పు..

సుమారు ఏడాది కిందట మానవపాడు మండలం తహసీల్దార్‌ కార్యాలయం రికార్డు గదికి గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పుపెట్టి విలువైన భూ రికార్డులను బుగ్గిపాలు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే ఓ పెద్ద తలకాయలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తరువాత సమగ్రంగా దరా్యాప్తు చేయడంలో ముందడుగు వేయలేకపోయారు. దీంతో ఇంతటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో అధికారులు విఫలమయ్యారు.

● ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కేంద్రంలో జిల్లా పంచాయతీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కంప్యూటర్లు, ఇతర ముఖ్యమైన ఫైళ్లు అగ్నిలో ఆహుతయ్యాయి. దీనిపై కూడా అప్పటి ప్రభుత్వంలో కీలక నేత ముఖ్య అనుచరుడి పాత్రపై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అసలైన నిందితులను నేటికీ గుర్తించలేకపోయారు.

గద్వాల నియోజకవర్గంలో కల్తీ కల్లు తయారీకి పెట్టింది పేరని రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. ఇక్కడ కొందరు నేతలే సొసైటీలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని నిజమైన సొసైటీ సభ్యులను పావులుగా మార్చుకుని యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారనే ప్రచారం బాహటంగానే వినిపిస్తుంది. కల్తీకల్లు(ఆల్ఫాజోలం, శాక్రీన్‌, సీహెచ్‌ వంటి నిషేధిత ప్రమాదకర రసాయ పదార్థాలను వినియోగించి) విక్రయాలకు నిలయంగా మారిందనే విమర్శల వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి హైదరాబాద్‌ సచివాలయంలో తన చాంబర్‌లో సోమవారం నిర్వహించిన ఎకై ్సజ్‌ శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో గద్వాల పేరు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా కల్లుదుకాణాల లైసెన్సు అనుమతులు, వాటి పునరుద్ధరణ, వాటి నిర్వహణపై మంత్రి జూపల్లి సూటిగానే ఎకై ్సజ్‌ శాఖ అధికారులను ప్రశ్నించారని, మీ పనితీరు బాగోలేదంటూ.. మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని సుతిమెత్తగానే ఘాటైన హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. కల్లు దుకాణాల లైసెన్సు పునరుద్ధరణ, నిర్వహణలో సభ్యుల పాత్ర తదితర వివరాలు నివేదిక రూపంలో ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వాటి నిర్వహణ వెనుకాల ఉన్న పెద్ద మునుషుల పాత్రపై కూడా వాడీవేడిగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. డ్రగ్స్‌, కల్తీకల్లు వంటివాటిపై సీఎం సీరియస్‌గా ఉండటంతో గద్వాలలో కొన్నిచోట్ల నేతల కబంధ హస్తాల్లో కొనసాగుతున్న అక్రమ కల్లు దుకాణాల దందాను పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లు విక్రయాలు సాగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని అధికారులకు మంత్రి జూపల్లి హుకుం జారీ చేసినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వంలోనైనా గద్వాలలో కొనసాగుతున్న అక్రమ కల్తీకల్లు విక్రయాలకు, అదేవిధంగా వరుస అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో.. వేచిచూడాలి.

కల్తీ కల్లు విక్రయాల్లో ప్రత్యేకం..

న్యూస్‌రీల్‌

మిల్లర్లపై చర్యలకు వెనకడుగు వేస్తున్న సివిల్‌ సప్లయ్‌ అధికారులు

రెవెన్యూ, పంచాయతీ శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టిన నిందితులపై చర్యలు శూన్యం

కల్లు దుకాణాల అనుమతుల అవకతవకలపై ఆరోపణలు

హైదరాబాద్‌లో మంత్రి జూపల్లితో ఎకై ్సజ్‌శాఖ అధికారుల భేటీపై ప్రాధాన్యం

కల్లు అక్రమార్కుల్లో తీవ్ర కలకలం

ప్రభుత్వ స్థలాలు కబ్జా..

గద్వాల జిల్లాకేంద్రంలో మున్సిపాలిటీ పరిధి కుంటవీధిలో సుమారు రూ.కోటికి పైగా విలువ చేసే పదిశాతం స్థలాన్ని మున్సిపాలిటీలో సహాయక సభ్యుడిగా ఉన్న ఓ నేత దర్జాగా కబ్జా చేసి డూఫ్లెక్స్‌ ఇంటి నిర్మాణం చేపట్టాడు. దీనిపై మీడియా వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ రాజకీయ పలుకుబడి అడ్డు రావడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేశారు. నేటికీ అక్రమ కట్టడం అలాగే ఉంది. అదేవిధంగా పట్టణంలో చాలా చోట్ల రూ.కోట్లు విలువ చేసే పదిశాతం స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నా.. అధికారులు స్పందించడం లేదు.

గద్వాల పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న కల్లు దుకాణం
1/3

గద్వాల పట్టణంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న కల్లు దుకాణం

2/3

గద్వాల పట్టణం కుంటవీధిలో కబ్జాకు గురైన పదిశాతం స్థలంలో ఇంటి నిర్మాణం
3/3

గద్వాల పట్టణం కుంటవీధిలో కబ్జాకు గురైన పదిశాతం స్థలంలో ఇంటి నిర్మాణం

Advertisement
Advertisement