వైభవంగా కాండ్రకోట నూకాలమ్మ జాతర | Sakshi
Sakshi News home page

వైభవంగా కాండ్రకోట నూకాలమ్మ జాతర

Published Tue, Mar 21 2023 2:14 AM

జాతరకు హాజరైన భక్తులు - Sakshi

భారీగా తరలివచ్చిన భక్తులు

భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు

పెద్దాపురం: పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు గవరసాని వీరాస్వామి, ఆలయ కార్యనిర్వహణాధికారి తలాటం వెంకట సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏపీ హౌసింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, జెడ్పీటీసీ గవరసాని సూరిబాబు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, ఎంపీపీలు పెంకే సత్యవతి, బొబ్బరాడ సత్తిబాబు, దేవదాయ శాఖ జిల్లా అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హౌసింగ్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి మొక్కులను తీర్చుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళిమోహన్‌ ఆదేశాల మేరకు సీఐ అబ్దుల్‌ నబీ, ఎస్‌ఐ వెలుగుల సురేష్‌ల ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద కోలాటం, గరగల నృత్యం, మ్యూజికల్‌ నైట్‌, దేవతామూర్తుల వేషధారణ, కాళికావేషాలు, విద్యుత్‌ అలంకరణల ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

గరగను బయటకు తీసుకువచ్చి జాతరను 
ప్రారంభిస్తున్న దొరబాబు తదితరులు
1/1

గరగను బయటకు తీసుకువచ్చి జాతరను ప్రారంభిస్తున్న దొరబాబు తదితరులు

Advertisement
Advertisement