వైఎస్సార్‌ అపరభగీరథుడు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ అపరభగీరథుడు

Published Sat, Sep 2 2023 12:08 AM

- - Sakshi

తాండవ జలాశయానికి మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవం పోశారు. గతంలో ఆయకట్టు శివారుప్రాంతాలకు నీరు చేరకు ఇబ్బందులు పడేవాళ్లం. పాదయాత్ర సమయంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తాండవ ఆయకట్టు రైతులమంతా కలిసి జలాశయాన్ని, కాలువలను అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందజేశాం. అధికారంలో వచ్చిన వెంటనే మేజర్‌, మైనర్‌ కాలువల అభివృద్ధికి రూ. 55 కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరైందే తడువుగా వెంటనే పనులు ప్రారంభించారు. కాలువలన్నింటినీ సీసీ కాలువులుగా అభివృద్ధి చేసి శివారు ప్రాంతాలకు సైతం నీరందించారు. మహానేత పుణ్యమా అని 20 వేల ఎకరాల్లో పంట సస్యశ్యామలంగా మారింది.

– కరక అప్పలనాయుడు, కేఈ చిన్నయ్యపాలెం

బీడు భూములు సస్యశ్యామలం

నాకు పుష్కర ఎత్తిపోతల పథకం ఆయకట్టులో ఐదు ఎకరాల పొలం ఉంది. 2008కి ముందు ఈ పొలంలో ఒక పంట పండేదుకు చాలా ఇబ్బందిగా ఉండేది. దివంగతనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తోట వెంకటాచలం పుష్కర ఎత్తుపోతల పథకం ఏర్పాటు చేయడంతో నా పొలానికి సమృద్ధిగా నీరు అందుతోంది. ఈ పథకం ఏర్పాటుకు ముందు ఒక పంట పండేందుకే చాలా కష్టంగా ఉండేది. ప్రస్తుతం రెండు పంటలకు నీరు అందుతుంది. బీడు వారిన పొలాలను బంగారుచేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుంది.

– ఒబిణ్ని కృష్ణ.గండేపల్లి

1/1

Advertisement
Advertisement