2019 నుంచి ఇప్పటి వరకు జిల్లా ప్రజలకు చేకూరిన లబ్ధి | Sakshi
Sakshi News home page

2019 నుంచి ఇప్పటి వరకు జిల్లా ప్రజలకు చేకూరిన లబ్ధి

Published Wed, Nov 8 2023 11:38 PM

- - Sakshi

పథకం లబ్ధిదారులు అందజేసిన మొత్తం

రూ.(కోట్లలో)

డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా 1,74,062 573.57

డాక్టర్‌ వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు 79,242 11.56

డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రీ క్రాఫ్‌ ఇన్సూరెన్స్‌ 59,724 296.35

ఇన్‌ఫుట్‌ సబ్సిడీ టు ఫార్మర్స్‌ 74,963 94.95

డాక్టర్‌ వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం 1,636 27.53

డాక్టర్‌ వైఎస్సార్‌ పశు నేస్తం పరిహార పథకం 2,364 6.63

జగనన్న జీవక్రాంతి 4,183 7.74

జగనన్న పాలవెల్లువ 20,930 38.72

మత్స్యకారులకు భరోసా 24,147 99.61

డీజిల్‌ రాయితీ (లీటర్లలో) 3,04,08,742 18.92

జగనన్న వసతి దీవెన 48,078 170.07

జగనన్న విద్యా దీవెన 48,880 376.76

జగనన్న అమ్మ ఒడి 2,91,247 1154.64

జగనన్న విద్యాకానుక 1,91,630 116.63

గోరుముద్దలు 1,59,925 102.46

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 2,00,708 436.89

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా 22,827 11.46

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆసరా 37,273 897.83

డాక్టర్‌ వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక 2,82,386 3495.91

డాక్టర్‌ వైఎస్సార్‌ సున్నావడ్డీ (ఎస్‌హెచ్‌జీఎస్‌) 44,793 161.72

డాక్టర్‌ వైఎస్సార్‌ చేయూత 1,03,576 540.79

జగనన్న తోడు 61,496 175.62

డాక్టర్‌ వైఎస్సార్‌ బీమా 3,989 64.81

పీఎం స్వానిధి 7,320 34.33

డాక్టర్‌ వైఎస్సార్‌ కాపు నేస్తం 46,557 264.34

జగనన్న చేదోడు (రజక, టైలర్స్‌, నాయీ బ్రాహ్మణులు) 13,314 37.29

ఈబీసీ నేస్తం స్కీం 9,995 28.31

డాక్టర్‌ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ 1,04,941 261.10

డాక్టర్‌ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ 21,840 92.99

డాక్టర్‌ వైఎస్సార్‌ నేతన్న నేస్తం 2,642 30.16

డాక్టర్‌ వైఎస్సార్‌ వాహన మిత్ర 12,970 61.63

సాక్షిప్రతినిధి, కాకినాడ: చేసిన మేలు ఎవరూ మరిచిపోకూడదంటారు. వివక్షకు తావు లేకుండా, అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసుకుంటూ వస్తోంది. గత పాలనలో లబ్ధి జరగాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకోవాలి. ఇంటిపై పార్టీ జెండా ఎగరేయాలి. పసుపు చొక్కా వేసుకుని పార్టీ తరఫున ప్రచారం చేయాలి. ఇన్ని చేస్తేనే గాని ప్రభుత్వ పథకం అందేది కాదు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లుగా ప్రతి గడప వద్దకూ పారదర్శకమైన పాలన దరి చేరింది. ప్రత్యర్థి పార్టీకి ఓటేసినా కూడా అర్హత ఉంటే చాలు ప్రతి పథకం ద్వారా లభించే లబ్ధిని వలంటీరు ఇంటి ముంగిటకే వచ్చి తలుపుతట్టి మరీ చిరు నవ్వుతో అందిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు అడ్డగోలుగా బురద జల్లుతూ రాజకీయాలు చేస్తున్నాయి. వీటిని తిప్పి కొట్టి నాలుగున్నరేళ్లలో జిల్లాలో ప్రతి కుటుంబానికి అందించిన లబ్ధిని తెలియజేయడం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎంగా రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి శ్రీకారం చుడుతున్న ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలంటే’ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23 వరకు ప్రతి సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం చేపట్టిన మేలును వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వివరించనున్నారు.

నోడల్‌ అధికారుల నియామకం

ఈ కార్యక్రమం కోసం నోడల్‌ అధికారుల నియామకం పూర్తి అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈఓపీఆర్‌డీలు, పట్టణ ప్రాంతాల్లో అదనపు కమిషనర్‌లు లేదా, డిప్యుటీ కమిషనర్‌లు, వారు అందుబాటులో లేకుంటే గెజిటెడ్‌ అధికారులు నోడల్‌ అధికారులుగా ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో నోడల్‌ అధికారిగా జిల్లా ప్రణాళికా అధికారి (సీపీఓ) వ్యవహరిస్తారు. వీరి పర్యవేక్షణలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి వారికి నాలుగున్నరేళ్లలో చేపట్టిన ప్రగతిని వివరించి సచివాలయ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. 32 శాఖల ద్వారా ప్రజలకు జరిగిన మేలుకు సంబంధించిన నివేదికలను సచివాలయాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శిస్తారు. కాకినాడ జిల్లాలోని 27 మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా గడచిన నాలుగున్నరేళ్లుగా జరుగుతోన్న మేలును వివరించనున్నారు. సంక్షేమమే కాకుండా వ్యవసాయం, ‘నాడు–నేడు’ ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు...ఇలా అన్నింటా జరిగిన అభివృద్ధి ప్రదర్శించనున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి 23 వరకు ప్రతి రోజు 25 నుంచి 33 సచివాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించేలా జిల్లా యంత్రాంగం షెడ్యూల్‌ నిర్ణయించింది.

9–11–2023 నుంచి 23–11–2023 వరకు

కార్యక్రమ షెడ్యూల్‌

తేదీ సచివాలయాలు

సంఖ్య

తేదీ సచివాలయాలు

సంఖ్య

9 27

10 29

14 30

15 30

16 30

17 31

20 31

21 31

22 31

23 30

‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ పేరుతో

సరికొత్త కార్యక్రమం

నేటి నుంచి 23వ తేదీ వరకు నిర్వహణ

చేసిన పనులు సచివాలయాల్లో ప్రదర్శన

కలెక్టర్‌ పర్యవేక్షణలో

జిల్లా నోడల్‌ అధికారిగా సీపీఓ

ప్రభుత్వం ద్వారా జరిగిన మేలును వివరిస్తాం

ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికా ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తాం. ప్రస్తుతం 23వ తేదీ వరకు ఏ రోజు ఎన్ని సచివాలయాల్లో నిర్వహించాలో షెడ్యూల్‌ ఇచ్చాం. మిగిలిన రోజుల షెడ్యూల్‌ తర్వాత ప్రకటిస్తాం. సచివాలయాల్లో బోర్డులు, హోర్డింగ్‌లు పెడుతున్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు నోడల్‌ అధికారులను కూడా నియమించాం. ప్రజలకు ఎంత మేలు జరిగింది, ఏ మేరకు నిధులు నేరుగా, వివిధ పథకాల ద్వారా అందించాం. ఆ గ్రామ అభివృద్ధిపై విపులంగా వివరించనున్నాం.

– కృతికా శుక్లా, కలెక్టర్‌, కాకినాడ జిల్లా

1/1

Advertisement
Advertisement