Sakshi News home page

సమగ్ర అభివృద్ధ్దే లక్ష్యం

Published Wed, Nov 8 2023 11:38 PM

తొండంగి మండలం కృష్ణాపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి రాజా - Sakshi

తొండంగి: రాష్ట్రంలో ప్రజలకు నవరత్నాల సంక్షేమ పథకాలు అందించడంతోపాటు యువతకు ఉపాధి కల్పన కోసం పారిశ్రామికాభివృద్ధితో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖమంత్రి దాడిశెట్టిరాజా అన్నారు. బుధవారం తొండంగి మండలంలోని ఒంటిమామిడి దివీస్‌ ల్యాబోరేటరీస్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో కృష్ణాపురంలో రూ2.74 కోట్లతో, వాకారిపేటలో రూ1.44 కోట్లతో సీసీరోడ్లకు శుంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ తీరప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా రహదారుల అభివృద్ధి, మినీపోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. పర్యవరణానికి విఘాతం కలగకుండా అగ్రికల్చర్‌ బేస్‌డ్‌ పరిశ్రమల స్థాపన జరుగుతోందన్నారు. తీర ప్రాంతం భవిష్యత్తులో అగ్ర నగరాల సరసన చేరనుందన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ మౌలిక వసతుల కల్పన, విద్యాభివృద్ధి, ప్రజారోగ్యం కోసం రక్షిత మంచినీటి వాటర్‌ప్లాంట్ల ఏర్పాటు వంటి సేవలు అందించడం అభినందనీయమన్నారు. తుని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాకినీడి బాబు, మాజీ చైర్మన్‌ కొయ్యా మురళి, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, వైస్‌ ఎంపీపీ నాగం గంగబాబు, పార్టీ మత్స్యకార విభాగం తుని నియోజకవర్గ కన్వీనర్‌ మేరుగు ఆనందహరి, పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు గాబు రాజు, తహసీల్దార్‌ జి.సుబ్రహ్మణ్యం, ఎంపీడీవొ పసుపులేటి సతీష్‌, దివీస్‌ కంపెనీ ప్రతినిధులు సుధాకర్‌, వాసుబాబు, పార్టీ మండల కన్వీనర్‌ బద్ది నూకరాజు, యూత్‌ కన్వీనర్‌ ఆరుమిల్లి ఏసుబాబు చౌదరి, సర్పంచ్‌లు కందా శ్రీధర్‌, బూర్తి రత్నకుమారి, ఎంపీటీసీ సభ్యులు ఇంటి వీరభద్రరావు, దడాల విజయ్‌, బద్ది బుజ్జి, పేకేటి సూరిబాబు, ఎంఎల్‌వో మాకినీడి రాజేష్‌, పార్టీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ

మంత్రి దాడిశెట్టి రాజా

కృష్ణాపురం, వాకదారిపేటల్లో

రూ.4.18 కోట్లతో

రోడ్లకు శంకుస్థాపన

Advertisement

తప్పక చదవండి

Advertisement