స్మార్ట్‌సిటీ పనులు వేగవంతం చేయండి | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌సిటీ పనులు వేగవంతం చేయండి

Published Thu, Nov 16 2023 6:12 AM

సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృతికా శుక్లా  - Sakshi

కాకినాడ సిటీ: కాకినాడ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఎస్‌సీసీఎల్‌) ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు సత్వరం అందుబాటులోకి తేవాలని కలెక్టర్‌, కేఎస్‌సీసీఎల్‌ చైర్‌పర్సన్‌ కృతికా శుక్లా అధికారులను కోరారు. కలెక్టరేట్‌ కోర్టు హాలులో కేఎస్‌సీసీఎల్‌ 39వ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌, కేఎస్‌సీసీఎల్‌ఏ సీఈవో, ఎండీ సీహెచ్‌ నాగ నరసింహారావుతో కలసి స్మార్ట్‌ సిటీ పనులపై ఆమె సమీక్షించారు. తొలుత గత జూలైలో జరిగిన 38వ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. అనంతరం సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా స్మార్ట్‌ సిటీ మిషన్‌ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకూ పూర్తయిన పనుల వివరాలు, ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై చర్చించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చివరి దశకు చేరిన పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. మూడు దశల్లో రూ.68.10 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో రెండు దశల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మూడో దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీఐ) కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి ఆసక్తి, సంసిద్ధత తెలిపిన సంస్థల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు. ఐసీసీసీ పునరుద్ధరణ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ ప్రతిపాదనలను సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆమె కోరారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ పి.వెంకటరావు, స్వతంత్ర డైరెక్టర్‌ టీవీఎస్‌ కృష్ణకుమార్‌, జేవీఆర్‌ మూర్తి, కంపెనీ సెక్రటరీ ఎం ప్రసన్నకుమార్‌, ఫైనాన్స్‌ మేనేజర్‌ సీహెచ్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కృతికా శుక్లా

39వ బోర్డు సమావేశంలో

అధికారులతో సమీక్ష

Advertisement
Advertisement