ప్రత్యేక వైద్య సేవలు | Sakshi
Sakshi News home page

ప్రత్యేక వైద్య సేవలు

Published Thu, Nov 16 2023 6:12 AM

- - Sakshi

జేఏఎస్‌ నుంచి సిఫార్సు చేసిన వారికి జీజీహెచ్‌లో ప్రత్యేక వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వారి ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా పర్యవేక్షించేందుకు ఆర్‌ఎంవోకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. వైద్య సేవల, ఆరోగ్య స్థితి గతులపై ఆయా విభాగాల హెచ్‌వోడీలు పత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహా కలెక్టర్‌కు అందిస్తున్నాం. 800 మందికి పైగా జీజీహెచ్‌లో చేరారు.

– డాక్టర్‌ ఎస్‌.లావణ్యకుమారి, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌,కానినాడ

తీసుకెళ్లి చేర్చుతున్నాం

నేను, డీఐవో డాక్టర్‌ రత్నకుమార్‌ సిబ్బందితో కలిసి దశల వారీగా జేఏఎస్‌ సిఫార్సు రోగులను నేరుగా జీజీహెచ్‌లో చేర్చుతున్నాం. ఇప్పటికే ఎనిమిది విడతల్లో 872 మందిని చేర్చాం. డిజిటల్‌ నమోదు కోసం వారి ప్రాంతాలకు చెందిన ఏఎన్‌ఎంలు, ఆశాలు వారి వెంట ఉంటారు. పలువురికి శస్త్రచికిత్సల అవసరం కాగా వారిలో కొందరికి ఇప్పటికే చేశారు. మరికొందరికి తేదీలు ఖరారు చేశారు. సిఫార్సు దారుల్లో ఎక్కువ మంది ఇన్‌ పేషంట్లుగా నమోదై ఆసుపత్రిలో చేరారు.

– డాక్టర్‌ నరసింహ నాయక్‌, డీఎంహెచ్‌వో

1/1

Advertisement
Advertisement