పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు | Sakshi
Sakshi News home page

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

Published Thu, Nov 30 2023 2:24 AM

కార్యక్రమంలో పాల్గొన్న 
కలెక్టర్‌ కృతికా శుక్లా తదితరులు - Sakshi

కాకినాడ సిటీ: జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడలో ఎంటర్‌ప్రైజెస్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎంఎస్‌సీ–సీడీపీ) కింద రూ. 14.76 కోట్లతో ఏర్పాటు చేసిన శ్రీసత్యదేవ ప్రింటింగ్‌ క్లస్టర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, పరిశ్రమల శాఖ జీఎంటీ మురళి, ఏపీఐఐసీ జెడ్‌ఎం మురళీమోహన్‌ తదితరులు హాజరయ్యారు. వర్చువల్‌ ద్వారా జరిగిన సీఎం కార్యక్రమం ముగిశాక ప్రింటింగ్‌ క్లస్టర్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని కలెక్టర్‌ కృతికా శుక్లా అతిధులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.

ఉపాధి కల్పన

కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కింద కాకినాడలో ప్రింటింగ్‌ క్లస్టర్లును ఏర్పాటైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి ఎంఎస్‌ఈ–సీడీపీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో 70 శాతం కేంద్ర నిధులు రూ.10.33 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.95 కోట్లు, స్పెషల్‌ పర్సన్‌ వెహికల్‌ లబ్ధిదారుల విరాళంతో మిగిలిన 10 శాతం నిధులు సమకూర్చాయని పేర్కొన్నారు. ఇందులో 250 చిన్న, తరహా, సూక్ష్మ స్థాయి ప్రింటింగ్‌ యూనిట్ల ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా, ఐదువేల మంది పరోక్షంగాను ఉపాధి పొందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపనతో జిల్లాలో వేలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. జిల్లాను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా కృషి చేస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు. పెద్దాపురం ఇండస్ట్రియల్‌ ఏరియాలో కూడాశంకుస్థాపన జరిగిందన్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు వీటిని అద్దెకు ఇస్తారన్నారు. ఈ కాంప్లెక్స్‌ నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని చెప్పారు. ఇందులో షెడ్లు కావలసిన వారు ఏపీఐఐసీని సంప్రదించాలన్నారు. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి వచ్చే ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహకాలను అందజేస్తారన్నారు.

ప్రింటింగ్‌ క్లస్టర్‌ను

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం

కలెక్టర్‌ నుంచి కార్యక్రమానికి

హాజరైన అధికారులు

Advertisement
Advertisement