పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్‌ | Sakshi
Sakshi News home page

పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్‌

Published Thu, Nov 30 2023 2:26 AM

- - Sakshi

చాన్నాళ్లుగా కళ్లు కనిపించక ఇబ్బందులు పడుతున్నాను. ఊళ్లో జగనన్న ఆరోగ్య సురక్ష జరుగుతుందని ముందుగా వైద్య సిబ్బంది మా ఇంటికి వచ్చి పరీక్షలు చేశారు. ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. ఆపరేషన్‌ అంటే భయపడ్డాను. పైసా ఖర్చవ్వదని చెప్పారు. పరీక్షలు చేయించి ఆపరేషన్‌ చేశారు. ఆపరేషన్‌ అయ్యాక రెండు రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి చూసి వెళుతున్నారు.

– ఇసుకపాటి లక్ష్మి, ఓదూరు,రామచంద్రపురం మండలం

వారానికి 80 సర్జరీలు

గతంలో వారానికి 25 సర్జరీలు చేసే వాళ్లం. జగనన్న ఆరోగ్య సురక్ష నుంచి వస్తున్న కేసులతో వారానికి 65 నుంచి 80 వరకు కేటరాక్ట్‌ సర్జరీలు చేస్తున్నాం. కంటి సమస్యలు చూపించుకునే చిన్న పిల్లల సంఖ్య బాగా పెరిగింది. అది పూర్తిగా పాడైనప్పుడు మాత్రమే తెలుస్తుంటుంది. చూపు పూర్తిగా కోల్పోయే స్థితి నుంచి రోగులను కాపాడగలుగుతున్నాం.

– ఫ్రొఫెసర్‌ ఎన్‌ రమాభారతి. ఆప్త్మాలజీ హెడ్‌..జీజీహెచ్‌

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement