రత్నగిరి అభివృద్ధికి కొత్త మాస్టర్‌ప్లాన్‌ | Sakshi
Sakshi News home page

రత్నగిరి అభివృద్ధికి కొత్త మాస్టర్‌ప్లాన్‌

Published Tue, Dec 5 2023 5:08 AM

అన్నవరం దేవస్థానం కొత్త మాస్టర్‌ ప్లాన్‌ - Sakshi

నేడు దేవదాయశాఖ కమిషనర్‌

కార్యాలయంలో సమావేశం

అన్నవరం: రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పఽథకాలకు సంబంధించి 2010లో రూపొందించిన ‘మాస్టర్‌ ప్లాన్‌’లో కొన్ని మార్పులు చేసి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. గత నెల మూడో తేదీన రత్నగిరిపై దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో రత్నగిరి నూతన మాస్టర్‌ ప్లాన్‌ను ఆమోదించారు. విజయవాడలోని దేవదాయశాఖ కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం జరిగే సమావేశంలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈఓ రామచంద్రమోహన్‌ సమావేశంలో పాల్గొంటారు. కమిషనర్‌ ఈ నిర్మాణాలకు అనుమతి మంజూరు చేసే ముందు రివైజ్డ్‌ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు.

పాత మాస్టర్‌ ప్లాన్‌ ఇలా..

ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్‌లో కొత్తగా సత్రాల నిర్మాణాలు చేపట్టాలని, అవన్నీ సత్యగిరి మీద చేపట్టాలని పేర్కొన్నారు. భక్తుల సంఖ్యను బట్టి టాయిలెట్‌లు నిర్మించాలని పేర్కొన్నారు. ఘాట్‌రోడ్‌లు వెడల్పు చేయాలని పేర్కొన్నారు. కొత్తగా క్యూ లైన్లు నిర్మించాలని పేర్కొన్నారు.

కొత్తగా మాస్టర్‌ ప్లాన్‌ చేర్చుతున్న అంశాలు

● నాలుగు మాడ వీధులు ఉండాలని మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు.

● భక్తులు ఏటా 40 శాతం పెరుగుతున్నారు. కరోనా తరువాత వ్యక్తిగత వాహనాలపై వచ్చే భక్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ వాహనాల నిలుపుదలకు మల్టీలెవిల్‌ పార్కింగ్‌, వాహనాలు కొండ దిగువకు వెళ్లేందుకు రోడ్లు నిర్మాణం చేపట్టాలి.

● అన్నదానం నుంచి, వివిధ సత్రాల నుంచి వచ్చే వ్యర్థాలు, టాయిలెట్స్‌ నుంచి వచ్చే వేస్ట్‌ కూ సూయెజ్‌ ట్రీట్మెంట్‌, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ ప్లాంట్‌లు కూడా ఇందులో చేర్చారు.

● దేవస్థానంలో వివిధ చోట్ల, ఘాట్‌రోడ్లలో విద్యుత్‌ దీపాల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ లైన్ల ఏర్పాటు

● మారేడు, తులసి వనాలు, మామిడి, అరటి తదితర చెట్లు, పూలతోటలు విరివిగా పెంచాలి.

● వసతి గదులు దొరకని భక్తులకు పలు చోట్ల విశ్రాంతి షెడ్ల నిర్మాణం ఆవశ్యకత, కొండదిగువన భక్తుల కోసం చేపట్టాల్సిన నిర్మాణాలు

● జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సత్యదేవుని నమూనా ఆలయం కూడా ఇందులో చేర్చారు.

Advertisement
Advertisement