రూ. 90 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు పట్టివేత | Sakshi
Sakshi News home page

రూ. 90 లక్షల విలువ చేసే విదేశీ సిగరెట్లు పట్టివేత

Published Tue, Dec 5 2023 5:08 AM

కస్టమ్స్‌ అధికారులు స్వాధీన పర్చుకున్న విదేశీ సిగరెట్లు  - Sakshi

రాజానగరం: కస్టమ్స్‌ సుంకాలు చెల్లించకుండా అక్రమంగా తరలిస్తున్న విదేశీ బ్రాండ్స్‌కి చెందిన 18 లక్షల సిగరెట్లను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు రాజానగరంలో జాతీయ రహదారిపై కస్టమ్స్‌ అధికారులకు సోమవారం తనిఖీలు చేస్తుండగా రెండు వాహనాలలో తరలిస్తున్న ఈ సరకు దొరికింది. ఒక వాహనంలో బ్యాగ్లో విమల్‌ గోల్డ్‌ బ్రాండ్‌ సిగరెట్లు, రెండో వాహనంలో పారిస్‌ బ్రాండ్‌ సిగరెట్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని అంచనా. బిహార్‌లోని పాట్నా నుంచి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. నిందితులు పరారు కాగా రెండు వాహనాలతో సహా సరకుని స్వాధీనపర్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement