జిల్లాలో 30 పోలీసు యాక్ట్‌ అమలు | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 2 2023 9:20 PM

- - Sakshi

కామారెడ్డి క్రైం: జిల్లాలో నెలాఖరు వరకు 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.

ముగిసిన క్రెడా

నామినేషన్ల స్వీకరణ

కామారెడ్డి అర్బన్‌: కామారెడ్డి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ అసోసియేషన్‌ (క్రెడా) ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్ర క్రియ ముగిసింది. అధ్యక్ష స్థానానికి ఐదు, ప్రధాన కార్యదర్శి పదవికి ఏడు, కోశాధికా రికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి జి.శ్రీధర్‌ తెలిపారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 6వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు.

‘రేవంత్‌రెడ్డిపై దాడి

పిరికిపందల చర్య’

కామారెడ్డి టౌన్‌: భూపాలపల్లిలో పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నా యకులు దాడి చేయ డం దారుణమని డీసీసీ అధ్యక్షుడు కై లాస్‌ శ్రీనివాస్‌రావ్‌ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నా యకులది పిరికిపంద చర్య అన్నారు. ప్రజాస్వా మ్యాన్ని హత్య చేస్తున్న బీఆర్‌ఎస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రేవంత్‌రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయా లని డిమాండ్‌ చేశారు.

5,401 మందికి కంటి పరీక్షలు

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం 5,401 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 671 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,63,901 మందికి కంటి పరీక్షలు చేసి, 26,337 మందికి కంటి అద్దాలను అందించామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.

నేడు తెయూలో

ఇంటర్నేషనల్‌ వర్క్‌షాప్‌

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లా విభాగం ఆధ్వర్యంలో ‘ఇంటర్‌డిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ ఇన్‌ యూకే అండ్‌ ఇండియా: ఆపర్చునిటీస్‌ అండ్‌ అబ్‌స్టాకిల్స్‌’ అనే అంశంపై గురువారం ఒక రోజు అంతర్జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు లా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌, కన్వీనర్‌ ప్రసన్నరాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెయూ లా కాలేజ్‌ సెమినార్‌ హాల్‌లో జరిగే వర్క్‌షాప్‌లో ప్రధాన వక్తగా శేషేంద్ర శేశభట్టర్‌(కౌన్సిలర్‌ అండ్‌ పేరేంట్‌ గవర్నర్‌ ఫర్‌ స్టేట్‌ ఫండెడ్‌ స్కూల్‌, యునిటైడ్‌ కింగ్‌డమ్‌) ప్రసంగిస్తారని తెలిపారు. వర్క్‌షాప్‌లో తెయూ వీసీ రవీందర్‌, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ విద్యావర్ధిని, లా డీన్‌ వినోద్‌కుమార్‌ పాల్గొంటారని తెలిపారు. వర్క్‌షాప్‌ కోకన్వీనర్‌లు గా బి.స్రవంతి, జెట్లింగ్‌ ఎల్లోసాలు వ్యవహరిస్తారని ఆమె పేర్కొన్నారు.

యాదాద్రికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

ఖలీల్‌వాడి: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి ఆర్టీసీ ప్రత్యేక బ స్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం ఉషాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు వార్షిక బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బ్రహోత్సవాల సందర్భంగా భక్తులు, కుటుంబసభ్యులు, కాలనీవాసులు, బృందాలుగా వెళ్లేవారు కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకు ప్రత్యేక బస్సులను పంపిస్తామని తెలిపారు. ఆసక్తి గల వారు ఈ కింద డిపో మేనేజర్ల ఫోన్‌నంబర్లను సంప్రదించవచ్చు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement