తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టం | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 7 2023 12:36 AM

లక్ష్మి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద తగ్గిన నీటిమట్టం   - Sakshi

బాల్కొండ :శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగి సీజన్‌కు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగు తుండటంతో ప్రాజెక్ట్‌ నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 42 టీఎంసీలకు చేరుకుంది.సగం కంటే ఎక్కువ నీరు ఖాళీ అయింది.ప్రాజెక్ట్‌ పూర్తి నీటి నిల్వ 90 టీఎంసీలు.యాసంగి సీజన్‌ ప్రారంభంలో కూడ 90 టీఎంసీల నీరు ని ల్వ ఉంది.కాని కాలువల ద్వారా నిరంతరం నీటి వి డుదల కొనసాగుతుండటం వలన ప్రాజెక్ట్‌ నీరు వేగంగా తగ్గుతోంది.వారబందీలో వారం రోజులు ఎక్కువ,తక్కువ నీటిని వదులుతున్నారు.గతంలో వారం రోజులు నీటి విడుదల,వారం రోజులు నిలుపుదల ఉండేది. ప్రస్తుతం అలా కాకుండా నిరంత రం నీటి విడుదల చేపట్టడం వలన రెండున్నర నెల ల వ్యవధిలోనే 48 టీఎంసీల నీరు ఖాళీ అయింది. మరో నెలన్నర రోజులు నీటిని సరఫరా చేయాల్సి ఉంది.

గతేడాది కంటే 10 టీఎంసీలు ఎక్కువ

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో గతేడాది కంటే 10టీఎంసీల నీరు ముందే వినియోగం జరిగింది. గతేడాది యాసంగి సీజన్‌కు ప్రస్తుత సంవత్సరం యాసంగి సీజన్‌ ప్రకారమే నీటి విడుదల చేపట్టారు. ప్రారంభంలో గతేడాది కూడ 90 టీఎంసీల నీరు నిల్వ ఉండే. గతేడాది ఇదే రోజు నాటికి ప్రాజెక్ట్‌లో 52 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ప్రస్తుత సంవత్సరం 42 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల..

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి యాసంగిసీజన్‌ కోసం కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, అలీసాగర్‌ లిఫ్టు ద్వారా 360 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 405 క్యూసెక్కులు, ఎస్కేప్‌ గేట్ల ద్వారా 150 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 539 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా ప్రాజెక్ట్‌లో 1076(42 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు పేర్కొన్నారు.

42 టీఎంసీలకు చేరిన నీరు

సగం కంటే ఎక్కువ ఖాళీ

కాలువల ద్వారా కొనసాగుతున్న

నీటి విడుదల

Advertisement
Advertisement