మోదీని ప్రశ్నించినందుకే రాహుల్‌పై వేటు | Sakshi
Sakshi News home page

మోదీని ప్రశ్నించినందుకే రాహుల్‌పై వేటు

Published Wed, Mar 29 2023 12:56 AM

బోధన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో మాట్లాడుతున్న మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి - Sakshi

బోధన్‌ : పార్లమెంట్‌లో మోదీ, అదానీల మధ్య బంధాన్ని రాహుల్‌ ప్రశ్నించినందుకే కుట్ర పూరితంగా ఆయన చట్టసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు, కేంద్ర బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నియోజక వర్గ స్థాయి సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు.

దీక్షలో కూర్చున్న సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ అదానీ ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంట్‌లో చర్చ జరుగాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు నిత్యావసర సరుకులు, చమురు ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఽసిలిండర్‌ ధర రూ. 400 ఉంటే ఇప్పుడు రూ.1,200లకు పెంచారన్నారు. ప్రజాస్వామ్య, ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ది చెబుతారని పేర్కొన్నారు. సత్యాగ్రహ దీక్షకు బోధన్‌ నియోజక వర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్‌, ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, డెలిగేట్‌ గంగా శంకర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గౌసోద్దీన్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మోహినోద్దీన్‌, నాయకులు పులి శ్రీనివాస్‌, మోబిన్‌ ఖాన్‌, రాజేశ్వర్‌ పటేల్‌ తదితరులున్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే

బుద్ధి చెబుతారు

మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి

బోధన్‌లో సత్యాగ్రహ దీక్ష

Advertisement
Advertisement