బీజేపీ ఎంపీటీసీపై ఎంపీపీ భర్త దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీటీసీపై ఎంపీపీ భర్త దౌర్జన్యం

Published Thu, Apr 20 2023 1:06 AM

ఎంపీటీసీ మహిపాల్‌ను 
బయటకు తీసుకెళ్తున్న పోలీసులు  - Sakshi

సదాశివనగర్‌: మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం రసాభాసాగా సాగింది. సమావేశంలో ధర్మారావ్‌పేట్‌ బీజేపీ ఎంపీటీసీ మహిపాల్‌ యాదవ్‌ నేరుగా స్టేజీపై కూర్చున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం స్టేజీపై న కూర్చోవడానికి అర్హత లేదంటూ స్టేజీపై ఉన్న ఎంపీపీ అనసూయ, జెడ్పీటీసీ నర్సింలు, ఎంపీపీ భర్త రమేశ్‌ బయటకు వెళ్లగొట్టారు. ప్రొటోకాల్‌ ఎ లా ఉంటదో తనకు చూపించాలని అధికార పార్టీ నాయకులు,అధికారులను మహిపాల్‌ ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ నాయకులకు, ఎంపీటీసీ మ హి పాల్‌ యాదవ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అ ధికార పార్టీ నాయకులు ఎంపీటీసీని ఇష్టారీతిన తి ట్టి, బయటకు వెళ్లకపోతే మెడలుపట్టి గెంటేయాల్సి న పరిస్థితి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న విలేకరులపై సైతం ఎంపీపీ భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు సముదాయించి గొడవను సద్దుమణిగేలా చే శారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తు నే ఉంటానని మహిపాల్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

ఎంపీపీ భర్తపై కలెక్టర్‌కు జర్నలిస్టుల ఫిర్యాదు

కామారెడ్డి టౌన్‌: సదాశివనగర్‌ ఎంపీపీ అనసూయ భర్త రమేష్‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు బుధవారం కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. సదాశివనగర్‌ మండల పరిపత్‌ కా ర్యాలయంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భర్త రమేష్‌ హాజరుకావడంపై చిత్రికరిస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులపై అసభ్యపదజాలంతో దుర్భాషాలడాడని కలెక్టర్‌కు తెలిపారు. సమావేశంలో జర్నలిస్టులు రావద్దని తమపై చేయిచేసుకునేందు యత్నించాడని ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement