పకడ్బందీగా ర్యాండమైజేషన్‌ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ర్యాండమైజేషన్‌

Published Sat, Oct 21 2023 12:40 AM

మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ - Sakshi

కామారెడ్డి క్రైం: పకడ్బందీగా ర్యాండమైజేషన్‌ ప్రక్రి య చేపడుతున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తయిన వెంటనే కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరచాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్దార్లతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,61,163 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 791 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు 25 శాతం, వీవీ ప్యాట్‌ యంత్రాలను 40 శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్నామ ని వివరించారు. మొదటి ర్యాండమైజేషన్‌లో భాగంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా యంత్రాల కేటాయింపులు పూర్తి చేయడానికి శనివారం ఉదయం 8 గంటల వరకు ఈవీఎం గోదాములకు రావాలని సూచించారు. రెండో దఫాలో ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌ జరుగుతుందన్నారు. నవంబర్‌ 28న మూడో ర్యాండమైజేషన్‌లో కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడానికి సిద్ధం చేస్తామన్నారు. ఆయా పార్టీల వారు పోలింగ్‌ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement